Begin typing your search above and press return to search.

'అల వైకుంఠపురములో..' రీమేక్ కష్టాలు.. అలా జరిగితే ఇక అంతే!

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:12 PM GMT
అల వైకుంఠపురములో..  రీమేక్ కష్టాలు.. అలా జరిగితే ఇక అంతే!
X
అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో కార్తీక్‌ ఆర్యన్ హీరోగా 'షెహజాదా' పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో విడుదల కానున్న ఈ సినిమా చిక్కుల్లో పడింది.

అదేంటంటే.. చాలా కాలంగా ఈ సినిమా బాలీవుడ్లో ఓ సమస్యను ఎదుర్కొంటోంది. రీమేక్ చిత్ర నిర్మాతలకు.. ఒరిజినల్ సినిమా(తెలుగు అలవైకుంఠపురంలో) హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసిన నిర్మాత మనీష్ షా మధ్య.. సినిమా రిలీజ్ విషయంలో వివాదం కొనసాగుతోంది.రీమేక్ చిత్రాన్ని రిలీజ్ చేసేంత వరకు డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేయొద్దన్ని నిర్మాతలు పట్టుబడుతున్నారు. కానీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసిన మనీష్ మాత్రం.. అలా చేయడం కుదరదని.. ఒకవేళ రీమేక్ విడుదలైతే తనకు భారీగా నష్టం కలుగుతుందని అంటున్నారు. తన డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయకుండా ఉండాలంటే రీమేక్ చిత్రం ద్వారా వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడుగుతున్నారు. అయితే అందుకు రీమేక్ నిర్మాతలు ససేమీరా అంటున్నారు. అలా ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.

అయితే తాజాగా నిర్మత మనీష్.. రీమేక్ ప్రొడ్యూసర్స్కు ఛాలెంజ్ విసిరారు. ఒరిజినల్ డబ్బింగ్ సినిమాను తన గోల్డ్ మైన్స్ ఛానల్లో నేడు(ఫిబ్రవరి 2) విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అది ఇంకా యూట్యూబ్లోకి రాలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. ఇప్పటికే 'పుష్ప'తో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఒరిజినల్ సినిమా( తెలుగు అలవైకుంఠపురంలో) చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపుతారు. దీంతో రీమేక్ చిత్రానికి నష్టం కలిగి అవకాశం ముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, గతంలో అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' విడుదలై బాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. దీంతో అల్లు అర్జున్‌కు వచ్చిన క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్మాత మనీష్‌ షా భావించారు. అలా 'అల వైకుంఠపురములో' డబ్బింగ్‌ హక్కులు తన వద్ద ఉండటం వల్ల వెంటనే ఆ సినిమాను హిందీలోకి డబ్‌ చేశారు.

అంతేకాదు, గతేడాదే థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటికే ఆ చిత్రాన్ని 'షెహజాదా' పేరుతో రీమేక్ చేస్తున్న చిత్ర బృందం ఒక్కసారిగా కంగుతింది. ఓ పక్క సినిమా రీమేక్‌ చేస్తుంటే, తెలుగు వెర్షన్‌ను డబ్బింగ్‌ చేసి ఎలా థియేటర్స్‌లో విడుదల చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. అలా ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలోనే మనీష్‌ షాతో.. రీమేక్ చిత్ర బృందం సంప్రదింపులు జరిపి, సినిమా విడుదలను వాయిదా వేయించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.