Begin typing your search above and press return to search.

'అలా వైకుంఠపురం లో' హిందీ రీమేక్ వివాదం.. బన్నీ కంట్రోల్ లోకి..

By:  Tupaki Desk   |   5 Feb 2023 10:07 PM GMT
అలా వైకుంఠపురం లో హిందీ రీమేక్ వివాదం.. బన్నీ కంట్రోల్ లోకి..
X
ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాను హిందీలో కార్తీక్​ ఆర్యన్​ హీరోగా 'షెహజాదా' అనే పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు స్వయంగా అల్లు అర్జునే రంగంలోకి దిగినట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే...? 'అల వైకుంఠపురంలో' సినిమా హిందీ డబ్బింగ్​ రైట్స్ కొనుచేసిన మనీశ్​.. 'షెహజాదా' నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతోంది. రీమేక్ సినిమా విడుదల అయ్యేంతవరకు డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయొద్దని నిర్మాతలు పట్టుబడుతున్నారు. కానీ డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిన మనీష్ మాత్రం ఆలస్యం అయ్యే కొద్ది తనకు భారీగా నష్టం వాటిల్లుతోందని అందుకే డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తానని అంటున్నారు.

నిజానికి డబ్బింగ్ చిత్రాన్ని ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు మనీష్. రీసెంట్ గా ఫిబ్రవరి 5 న తమ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తానని అన్నారు. కానీ ఏమైందో తెలీదు కానీ రిలీజ్ చేయలేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. పరిస్థితిని మోటం తన కంట్రోల్ లోకి తీసుకున్నారట.

నిర్మాత మనీష్ తన గోల్డ్ మైన్స్ సంస్ధ ద్వారా పుష్ప హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి అక్కడ థియోటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఆ చిత్రం పెద్ద హిట్ కావడంతో.. ఆ సమయంలోనే అలా వైకుంఠపురం లో హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కొనుగోలు చేశారు.

అప్పుడు బన్నీకి నిర్మాత మనీష్ తో మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో రీమేక్ చిత్రం తెరకెక్కింది. దీనిని భూషణ్ కుమార్ నిర్మించారు. ఇంకా ఈ చిత్రానికి అల్లు అర్జున్ తండ్రి, అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

దీంతో రీమేక్ చిత్రం కన్నా ముందు డబ్బింగ్ విడుదల అయితే.... రీమేక్ చిత్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రహించిన బన్నీ ... ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం చర్చలు జర్గుతున్నయట. అందుకే తాత్కాలికంగా అలా వైకుంఠపురం లో డబ్బింగ్ చిత్రాన్ని విడుదల కాకుండా వాయిదా వేశారు అని తెలిసింది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్తుందో పరిష్కారం అవుతుందో లేదో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.