Begin typing your search above and press return to search.
సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ పై బుద్దిలేదా అంటూ విమర్శలు!
By: Tupaki Desk | 7 Feb 2023 8:00 PMబాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడి ప్రస్తుతం బాలీవుడ్ నెం.1 హీరోగా నిలిచాడు. అందరు హీరోల కంటే ఎక్కువ వంద కోట్ల సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలను ఈజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తు వందల కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటూ అక్షయ్ టాప్ లో ఉన్నాడు.
హీరోగా అక్షయ్ కుమార్ ను అభిమానించే వారు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఆయన సినిమాలను మరియు ఆయన యొక్క పద్దతిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి అక్షయ్ కుమార్ పాపం అడ్డంగా బుక్ అయ్యాడు.
తాజాగా అమెరికా టూర్ లో ఉన్న అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో తో పాటు.. ఉత్తర అమెరికాలోని ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని పంచేందుకు గాను ది ఎంటర్ టైన్‌మెంట్స్ వారు సిద్దంగా ఉన్నారు.
మీరంతా కూడా సీటు బెల్టు పెట్టుకుని ఉండండి. మేము మీ ముందుకు మార్చిలో వస్తున్నాం అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేయడం జరిగింది.
వీడియో లో అక్షయ్ కుమార్ తో పాటు దిశా పటానీ.. నోరా పతేహి ఇంకా మౌనీ రాయ్ లు ఉన్నారు. వీరంతా కూడా ఒక గ్లోబ్ పై నడుస్తూ ఉన్నట్లుగా వీడియోను చూపించారు. ఆ వీడియో ఇప్పుడు అక్షయ్ కుమార్ తో పాటు హీరోయిన్స్ విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.
ఇండియా మ్యాప్ ను అలా కాళ్లతో అది కూడా చెప్పులు వేసుకుని తొక్కడం అంటే కచ్చితంగా దేశాన్ని అగౌరవ పర్చడం అవుతుంది అంటూ నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఇలా చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే సీరియస్ గా పరిణామాలు ఉంటాయి అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి అక్కీ భాయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.