మోడీకి మద్దతు ఇచ్చి విలన్ అయిన స్టార్ హీరో

Wed Apr 24 2019 20:00:01 GMT+0530 (IST)

Akshay Kumar And Pm Modi Is Getting Trolled On Social Media

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతున్న ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇతర విషయాల గురించి చర్చించడం జరిగింది. మోడీ ఇన్నేళ్లలో జర్నలిస్ట్ కాకుండా ఒక సినీ స్టార్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే పథమం అవ్వడంతో అంతా కూడా ఇంటర్వ్యూపై ఆసక్తి చూపించారు. అయితే ఈ ఇంటర్వ్యూను కొందరు ఎన్నికల జిమిక్కు అంటూ విమర్శిస్తున్నారు.కోట్లాది మంది అభిమానులు ఉన్న అక్షయ్ కుమార్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఆయన అభిమానులను ఆకట్టుకునే ఉద్దేశ్యం మోడీది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అక్షయ్ కుమార్ పై కూడా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో మోడీకి అనధికారికంగా అక్షయ్ కుమార్ మద్దతుగా నిలిచినట్లే అని ఈ సమయంలో ఇంటర్వ్యూ తీసుకోవడంలో అర్థం ఏంటీ అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూపై హీరో సిద్దార్థ్ స్పందిస్తూ... అక్షయ్ కుమార్ విలన్ ఆయన్ను తక్కువ అంచనా వేశాం అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ తో సిద్దు కూడా అక్షయ్ కి కౌంటర్ ఇచ్చినట్లుగా అందరు ఊహించేసుకుంటున్నారు. ఎన్నికల వేల మోడీకి మద్దతుగా అక్షయ్ నిలవడంపై సిద్దు ఇలా ట్వీట్ చేసి ఉంటాడని కొందరి అభిప్రాయం. అక్షయ్ ను విలన్ అనడం పై ఆయన అభిమానులు సిద్దును టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి అక్షయ్ కుమార్ ఎన్నికల సమయంలో మోడీని ఇంటర్వ్యూ చేయడంతో తాను మోడీ మనిషిని అని ఒప్పుకున్నట్లయ్యిందని కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు.