Begin typing your search above and press return to search.

'అక్షర' ను థియేటర్‌ లోనే చూపించబోతున్నారు

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:00 PM GMT
అక్షర ను థియేటర్‌ లోనే చూపించబోతున్నారు
X
నందిత శ్వేత హీరోయిన్ గా రూపొందిన 'అక్షర' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మొన్నటి వరకు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. నిర్మాత ఓటీటీ లో డైరెక్ట్‌ గా విడుదల చేసేందుకు ఒప్పుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని సినిమాను థియేటర్‌ లోనే విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్షర సినిమా ను థియేటర్‌ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఓటీటీ ల నుండి బిగ్‌ ఆఫర్లు వచ్చినా కూడా థియేటర్ల రిలీజ్ కు ముందుక వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమా ఫిబ్రవరి 26వ తారీకున విడుదల చేయబోతున్నారు. లేడీ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ అయిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆకట్టుకుంది. సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనుక సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. బి చిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్‌ వర్మ మరియు అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌ చేసే విధంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సంక్రాంతికి వచ్చిన సినిమాల హడావుడి తగ్గడం వల్ల ఈ సినిమాను ఫిబ్రవరి 26 న విడుదల చేయడం కరెక్ట్‌ నిర్ణయంగా యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.