Begin typing your search above and press return to search.

చెల్లికోసం సలార్ బ్యూటీ తంటాలు..!

By:  Tupaki Desk   |   7 May 2021 11:30 PM GMT
చెల్లికోసం సలార్ బ్యూటీ తంటాలు..!
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడుగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సాలిడ్ యాక్షన్ మూవీ రూపొందుతుంది. ఈ సాలిడ్ మూవీలో లీడ్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం శృతి అదృష్టం ఎలా ఉందంటే.. మూడేళ్లు సినిమాలు చేయకుండా ఇండస్ట్రీకి దూరమైన అమ్మడు.. ఈ ఏడాది క్రాక్ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఆ హిట్టు పుణ్యమా అని తాను ఫామ్ లోనే ఉన్నానంటూ అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సలార్ తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన లాభమ్ సినిమాలో నటిస్తోంది. ఇదివరకే విడుదలైన లాభమ్ టీజర్ - ట్రైలర్స్ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఈ సినిమాలో శృతి పల్లెటూరి జానపద గాయనిగా కనిపించనుందట.

ఇదిలా ఉండగా.. శృతి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ తో కుర్రకారును వేడెక్కిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే శృతి.. ప్రస్తుతం ఆమె సోదరి అక్షరతో గ్లామర్ ఫోటోషూట్స్ జరుపుతుందని టాక్. ఎందుకంటే చెల్లెలి కెరీర్ కోసం శృతికోసం వచ్చిన మంచి ఆఫర్స్ రిఫర్ చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఇప్పుడు ఫామ్ లో ఉన్నటువంటి శృతి దగ్గరకు పలువురు కాస్టింగ్ మేనేజర్స్ న్యూ ఆఫర్స్ రిఫర్ చేస్తున్నారట. కానీ అమ్మడు ఆల్రెడీ ఫామ్ లో ఉంది కాబట్టి తన చెల్లికి అవకాశం ఇవ్వాల్సిందిగా చెబుతోందట. అందుకే ఇప్పుడు చెల్లి అక్షరను కూడా గ్లామర్ ఫోటోషూట్స్ - వర్కౌట్స్ అంటూ సజెస్ట్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం అక్షర కూడా శృతి మాటవిని హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలలో టాక్. చూడాలి మరి ఈ సలార్ బ్యూటీ చెల్లిని హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో!