Begin typing your search above and press return to search.

#RAPO19 ః తెలుగు కోసం ఒకరు తమిళం కోసం మరొకరా?

By:  Tupaki Desk   |   1 Aug 2021 11:30 PM GMT
#RAPO19 ః తెలుగు కోసం ఒకరు తమిళం కోసం మరొకరా?
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని నటింపజేస్తున్న విషయం తెల్సిందే. రామ్‌కు జోడీగా కృతితో పాటు మరో ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో నటించబోతుందట. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అక్షర గౌడను ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటింపజేసేందుకు సిద్దం అయ్యారు. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్న విషయం తెల్సిందే. అందుకే ఇద్దరు ముద్దుగుమ్మలు అన్నట్లుగా ఎంపిక చేశారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ఉప్పెన సినిమాతో చేరువ అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టిని ఎంపిక చేయగా.. తమిళ ప్రేక్షకుల కోసం అన్నట్లుగా తాజాగా అక్షర గౌడను ఎంపిక చేశారేమో అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు భాషల్లో సినిమా రూపొందుతున్న సమయంలో ఇలాంటి ఎంపిక లు చాలా కామన్‌ గా జరుగుతూనే ఉంటాయి. అయితే హీరోయిన్స్ ఎంపిక కాస్త అరుదుగా జరుగుతుంది. రెండు భాషల్లో గుర్తింపు ఉన్న నటీ నటులు ఉంటే ఒక్కరు అయినా ఓకే కాని కృతి శెట్టికి తమిళంలో ఇంకా స్టార్‌డమ్‌ రాలేదు. కనుక తమిళ స్టార్‌ హీరోయిన్‌ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

రామ్‌ గత చిత్రం రెడ్‌ కు భారీ అంచనాలు ఉన్నా కూడా నిరాశ పర్చింది. ఆ సినిమా నిరాశ పర్చడం వల్ల రామ్‌ కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని ఒక మంచి స్క్రిప్ట్‌ ను లింగు స్వామి తీసుకు రాగా ఓకే చెప్పాడు. రామ్‌ ఇప్పటికే ఉత్తరాదిన తన డబ్బింగ్ సినిమాలతో చాలా పెద్ద స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు తమిళంలో కూడా తనకు మంచి గుర్తింపు దక్కించుకునేందుకు ఈ సినిమాను వాడుకోబోతున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.