మెగాస్టార్ తో అక్కినేని హీరో స్క్రీన్ షేర్

Sat Mar 18 2023 16:04:09 GMT+0530 (India Standard Time)

Akkineni hero screen share with Megastar

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో సుశాంత్ కూడా ఒకరు. ఆయన ఇంటి పేరు అక్కినేని కాకపోయినా అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తోనే వచ్చారు. కాబట్టి ఆయనను అక్కినేని సుశాంత్ అనే చాలా మంది అనుకుంటూ ఉంటారు. హీరోగా పరిచయమై కొన్ని సినిమాలు చేసిన ఆయనకు.. పెద్దగా కాలం కలిసి రాలేదు.ఈనెల మధ్య ఇతర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలో కనిపించడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. అలా అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం సినిమా అందులో కీలకపాత్రలో కనిపించాడు సుశాంత్. ఆ తర్వాత మరో సినిమాలో హీరోగా కనిపించిన అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ అందుకున్నాడు.

 ఈ అక్కినేని హీరో ఈ విషయాన్ని చిరంజీవి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి తనకు దగ్గర బంధువు అయ్యే మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.

అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు అనే విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది. శనివారం నాడు సుశాంత్ పుట్టినరోజు కావడంతో పోస్టర్ రిలీజ్ చేసి ఆయనకు విషెస్ చెప్పారు.

ఇక ఈ విషెస్ మీద స్పందించిన సుశాంత్... మెగాస్టార్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఇది తనకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ కామెంట్ చేశాడు. నిజానికి సుశాంత్ అలవైకుంఠపురంలో తర్వాత అనేక సినిమాల్లో వేరువేరు క్యారెక్టర్లు కూడా చేశాడు. ప్రస్తుతం రావణాసుర అనే సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ మొట్టమొదటిసారిగా విలన్ గా పండించబోతున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.