బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం!

Tue Jan 24 2023 16:25:58 GMT+0530 (India Standard Time)

Akkineni's fans are angry about Balayya's comments!

నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. తను నటించిన 'వీర సింహారెడ్డి' రీసెంట్ గా విడుదల కావడం.. అది యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడం తెలిసిందే.ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంలో కలిసి పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ఏదో మాట్లాడుతూ చివరికి అక్కినేని తొక్కినేని అంటూ టంగ్ స్లిప్పయ్యారు.

స్టేజ్ పై వున్న ఓ వ్యక్తి దగ్గరగా వెళ్లిన బాలకృష్ణ ఎవరి గురించో మాట్లాడుతూ ఆరోజుల్లో మీ నాన్నగారి గురించి.. ఆ రంగారావు..ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని' అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై ఆక్షణం నుంచే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.

బాలయ్య చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ నెటిజన్ లు విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

'నందమూరి తారకరామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం' అంటూ నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి బాలయ్య మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా వుంటే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వెంటనే నందమూరి బాలకృష్ణ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మహా నటులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మండిపడింది. అంతే కాకుండా బాలకృష్ణ అత్యంత బాధాకరమని తెలిపింది. బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్టే అని పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చాలా సందర్భాల్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.