Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోలు.. ముగ్గురూ మూడు జానర్లు

By:  Tupaki Desk   |   3 Jun 2023 6:00 AM GMT
అక్కినేని హీరోలు.. ముగ్గురూ మూడు జానర్లు
X
అక్కినేని ఫ్యామిలీ హీరోలు... ప్రస్తుతం హిట్ కోసం పరితపిస్తున్నారు. ఈ ముగ్గురూ హీరోలు గత కొన్నేళ్లుగా ఫ్లాపులు చవిచూస్తున్నారు. తండ్రి నాగార్జున ది ఘోస్ట్ పరాజయం తర్వత బ్రహ్మాస్త్రంలో నటించారు. ఆ సినిమాలో ఆయనది చిన్న పాత్ర కావడంతో ఫ్యాన్స్ కిక్ మాత్రం రాలేదు.

అందరూ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తోంటే.. నాగార్జున మాత్రం లోకల్ లో కూడా హిట్ కొట్టలేకపోతున్నారు. సాలిడ్ పడితే ఫ్యాన్స్ కూడా బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో నాగార్జున ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆయన ఈ సినిమాతోనే దర్శకుడిగా మారుతున్నారు.కస్టడీ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పురింజు మరియం జోస్ మలయాళ సినిమాను రిమేక్ చేస్తున్నట్లు సమాచారం.జూన్ రెండవ వారంలో పూజ నిర్వహించి జూలై ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ కు వెళ్తారని టాక్. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.

మరోవైపు నాగచైతన్య కూడా వరుస ఫ్లాప్ లు చవిచూశాడు. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ వరుసగా డిజాస్టర్లు వచ్చాయి. అయితే చైతు ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాతగా బన్నీ వాసు వ్యవహారిస్తున్నారు. అయితే ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.

ఇక మరోవైపు అక్కినేని వారసుడు చిన్న కుమారుడు అఖిల్ కు మొదటి నుంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్వాలేదనిపించినా... ఇప్పటి వరకు ఆయనకు సాలిడ్ హిట్ పడలేదు. ఈ ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ గా పాన్ ఇండియా లెవెల్ వచ్చినా... ఫలితం మాత్రం రాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇక అఖిల్ నెక్ట్స్ సినిమా ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్టు కొడతాడో లేదో చూడాలి. మొత్తానికి అక్కినేని హీరోలు ముగ్గురూ మూడు డిఫరెంట్ జానర్లతో వస్తున్నారు. చూడాలి ఎవరూ హిట్టుకొడతారో.