హీరో సుమంత్ పెళ్లి కార్డ్ ల పంపిణీ

Wed Jul 28 2021 09:05:28 GMT+0530 (IST)

Hero Sumanth Wedding Card Viral

హీరో సుమంత్ వివాహం గురించి ఇటీవల పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇది నిజమా? అంటే .. అవుననే తాజాగా రివీలన వెడ్డింగ్ కార్డ్ వెల్లడిస్తోంది. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర.. వివాహానికి ఇదే మా ఆహ్వానం.. అంటూ శుభలేఖను ముద్రించారు. త్వరలోనే ఈ వివాహం జగరనుంది. దీంతో కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారంలో నిజం ఉందని ప్రూవైంది.ఇప్పటికే ఇరువైపులా కార్డ్స్ పంపిణీ జరుగుతోంది. వివాహ కార్డులను SP (సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఉంటుందని భావిస్తున్నారు.

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా... అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుమంత్ సుపరిచితుడు. 2004 లో సహనటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ వారు రెండు సంవత్సరాల తరువాత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కీర్తి ఆ తర్వాత వేరే వివాహం చేసుకుని సెటిలయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ సుమంత్ ప్రేమను కనుగొన్నారు. వివాహానికి సిద్ధమవుతున్నారు. యువకుడు- గోదావరి- సత్యం- గౌరి వంటి విజయవంతమైన చిత్రాల్లో సుమంత్ నటించారు.