సమంతపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్.. కారణం ఇదే!

Sat Apr 01 2023 11:01:19 GMT+0530 (India Standard Time)

Akkineni Fans Fire on Samantha

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశంతో కాస్త అగ్రెసివ్ గా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.హిందీలో సమంతకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అక్కడ భారీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నాగ చైతన్యతో విడాకుల విషయమై సమంత మొదటి సారి మొన్న నోరు విప్పింది.

ఆ సందర్భంలో సమంత మాట్లాడుతూ... వైవాహిక బంధం విషయంలో తాను నూటికి నూరు శాతం చేయాల్సింది చేశాను. ఒక భార్యగా ఎలా ఉండాలో అలాగే ఉండేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కౌట్ కాలేదు. తన నుండి ఎలాంటి తప్పులేదు అన్నట్లుగా సమంత వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలతో మొత్తం తప్పు నాగచైతన్యదే అనే అభిప్రాయం కొంత మందిలో వ్యక్తం అవుతుంది.

ఇప్పుడు ఇదే వ్యవహారం అక్కినేని అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది. దాంతో వారు సోషల్ మీడియా వేదికగా సమంతపై విమర్శలు గుప్పిస్తున్నారు శాకుంతలం సినిమా ప్రమోషన్ కోసం నాగచైతన్యను అవమానించినట్లు మాట్లాడింది అని సమంత పై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లు విడాకుల గురించి మాట్లాడని సమంత శాకుంతలం సినిమా విడుదల సందర్భంగా మాట్లాడడం చూస్తుంటే ఆమె కచ్చితంగా సినిమా కి హైప్ రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిందని అక్కినేని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

నిజానికి సమంత వ్యాఖ్యలు చేసిన తర్వాత శాకుంతలం సినిమా గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారని సోషల్ మీడియా టాక్. అందుకనే అక్కినేని ఫ్యాన్స్ ఈ విధంగా ఆరోపిస్తున్నారు. మరి దీనికి సమంత ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.