ఇప్పటికైనా 'ఏజెంట్'' హడావుడి మొదలయ్యేనా?

Sat Apr 01 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Akkineni Akhil 'AGENT' Movie Updates

నిన్నటి వరకు అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది కనుక మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడతారేమో అని అక్కినేని ఫ్యాన్స్ భావించారు.అయితే ఏప్రిల్ నెల వచ్చేసింది. అఖిల్ ఏజెంట్ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అఖిల్ మార్కెట్ పరిధి దాటి ఈ సినిమాకి ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలు బాగుంటే ఎంత బడ్జెట్ పెట్టినా రికవరీ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కనుక ఏజెంట్ సినిమా సక్సెస్ అయితే బడ్జెట్ రికవరీ ఈజీనే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే ఏజెంట్ సినిమాకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ కాలేదు. రెండు పాటలు కొన్ని పోస్టర్స్ మినహా ఇప్పటి వరకు ఏజెంట్ ప్రమోషనల్ స్టఫ్ వచ్చిందే లేదు.

సినిమా విడుదల నెల వచ్చేసింది. ఇప్పటినుండి అయినా వరుసగా సినిమా కి ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే పర్వాలేదు కానీ లైట్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతుంది. సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తేనే పాజిటివ్ టాక్ వస్తే భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతాయి అని తాజాగా దసరా సినిమా ఫలితాన్ని బట్టి మరోసారి నిరూపితం అయ్యింది.

దసరా సినిమా కోసం నాని మరియు ఇతర యూనిట్ సభ్యులు సరిగ్గా నాలుగు వారాల నుండి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. పాన్ ఇండియా రేంజ్ లో దసరా సినిమాను విడుదల చేయడం జరిగింది.

అందుకు తగ్గట్లుగానే నాలుగు వారాల పాటు భారీ ఎత్తున ప్రమోషన్ చేశారు. ఏజెంట్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కనుక ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. మరో వైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటించాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి ఆ నమ్మకం అనుసారంగా సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.