నాన్న-పిన్ని.. మధ్యలో పవన్ కొడుకు

Fri Jun 22 2018 13:07:51 GMT+0530 (IST)

తమ కుమారుడు అకీరా నందన్ ను జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలవద్దంటూ కొన్ని రోజుల క్రితం.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చెప్పినంత మాత్రాన అభిమానులు వినేస్తారని కాదు కానీ.. తన కొడుకుకు సొంత ఐడెంటిటీ ఉండాలన్నది ఆమె కోరిక. రేణూదేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్నా లెజ్నోవాను పెళ్లి చేసుకున్నాడు పవన్.మరి ఇలాంటి సమయంలో పిన్ని వరుస అయ్యే ఆమెను అకీరా ఎలా రిసీవ్ చేసుకుంటాడనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. ఇప్పుడీ సందేహానికి చక్కని సమాధానమే దొరికింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు షార్ట్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం పవన్ కు కంటి ఇన్ఫెక్షన్ రావడమే. గతంలో రంగస్థలం మూవీ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా కూడా కళ్లజోడు పెట్టుకున్న సమయంలో ఈ విషయం చెప్పాడు పవన్. ఇప్పుడు విజయవాడలో కంటికి సర్జరీ కూడా చేయించుకున్నాడని తెలుస్తోంది.

ఈ సమయంలో పవన్ కు సహాయకుడిగా ఉండేదుకు నేరుగా పూనే నుంచి వచ్చాడు అకీరా. ఇదే సమయంలో అన్నా లెజ్నోవా కూడా అక్కడే ఉండడం విశేషం. పవన్ ను హోటల్ రూం నుంచి కారు దగ్గరకు తీసుకొచ్చే సమయంలో.. ఒకవైపు అకీరా.. మరోవైపు అన్నా లెజ్నోవా ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.