మహేష్ పాటకు పియానో వాయించిన పవన్ తనయుడు..!

Sun May 22 2022 08:40:32 GMT+0530 (IST)

Akira Nandan Playing Piano For Mahesh Babu Song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ స్టార్ కిడ్ వెండితెరపై హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ.. ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అప్పుడే మిగతా మెగా హీరోల రేంజ్ లో క్రేజ్ ఏర్పరచుకున్నాడు.ఇదిలా ఉంటే అకీరా కరాటే మరియు సంగీతం నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా కుమారుడిని మ్యూజిక్ క్లాస్ కు తీసుకెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు అకీరా టాలెంటెడ్ కీబోర్డ్ ప్లేయర్ అని కూడా నిరూపించుకుంటున్నాడు.

లేటెస్టుగా అకీరా కీబోర్డ్ ప్లే చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో క్లిప్ లో 'సర్కారు వారి పాట' చిత్రంలోని చార్ట్ బస్టర్ 'కళావతి' పాటను అకీరా ప్లే చేయడాన్ని మనం చూడవచ్చు. థమన్ స్వరపరిచిన సాంగ్ కు మెగా వారసుడు ట్యూన్ ప్లే చేసిన విధానాన్ని బట్టి అతని స్కిల్స్ అర్థం చేసుకోవచ్చు.

తమ అభిమాన హీరో తనయుడు అకీరా నందన్ తన టాలెంట్ ను నైపుణ్యాన్ని బయటపెట్టడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సైతం తమ హీరో పాటను అకీరా ప్లే చేయడం చూసి సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇకపోతే 6 అడుగుల 4 ఇంచుల హైట్ ఉండే అకీరా నందన్.. సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అకీరా మరియు అతని తల్లి రేణూ దేశాయ్ మనసులో ఏముందో మాకు తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి అకిరా నందన్ ఇప్పటికే ఓ మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన 'ఇష్క్ వాలా లవ్' సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం చదువు మీదే దృష్టి పెట్టిన అకీరా.. భవిష్యత్ లో మెగా హీరోల బాటలో నడుస్తాడో లేదో చూడాలి.