పవర్ స్టార్ వారసుడు బరిలో దిగుతున్నాడా?

Sun Dec 05 2021 21:00:01 GMT+0530 (IST)

Akira Gives Mom An Unforgettable Gift

పవన్ కళ్యాణ్ -రేణుదేశాయ్ ల వారసులు సుపరిచితమే. వారసులతో రేణు పూణేలో స్థిరపడగా అకీరా- ఆద్య ఇప్పటికే పెద్దవాళ్లుగా ఎదిగేశారు. భవిష్యత్ అక్కడే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ తో అనుబంధాన్ని ఈ కుటుంబం కొనసాగిస్తోంది. అప్పడప్పుడు సోషల్ మీడియా ద్వారా పవన్ అభిమానులకు టచ్ లోకి వస్తున్నారు. ఆ సంగతిని పక్కనబెడితే రేణు దేశాయ్ పుట్టిన రోజు సందర్భంగా కుమారుడు అకీరానందర్ తల్లికి మర్చిపోలేని గొప్ప బహుమతి ఇచ్చినట్లు రేణు దేశాయ్ తెలిపారు.తనకి పుట్టిన రోజు కానుకగా ఓ ఇష్టమైన పాటని బహుమతిగా ఇవ్వమని మామ్ కోరగా అందుకు అకీరా ఒకే చెప్పి రేణుకి ఇష్టమైన పాటకి పియానో వాయించాడు. `బొంబాయి` సినిమాలోని `ఉరికే చిలకా..` పాటకు అకీరా పియానో వాయించి తల్లి మనసు దోచుకున్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియోని రేణు దేశాయ్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసారు.  ఆ వీడియో పవన్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తండ్రికి తగ్గ వారసుడిగా మార్షల్ ఆర్స్ట్ లో తర్ఫీదు పోందాడు. అంతేనా ఆ రంగంలో  మాస్టర్ గానే వ్యవహరిస్తున్నాడు. ఇతరులకు కోచింగ్ ఇస్తూ మంచి  ట్రెయినర్ గాను పేరు సంపాదించాడు.

ఇప్పుడు పియానో వాయిద్యంతో మ్యూజిక్ కంపోజర్ గాను తన ప్రతిభ ని చాటుకుంటున్నాడు. మొత్తానికి అకీరా మల్టీట్యాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో లాంచింగ్ కంటే ముందుగానే తల్లి సూచనలు..సలహాలు మేరకు 24 శాఖలపైనా పట్టు సంపాదించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రేణు దేశాయ్-పవన్ విడిపోయినా  పిల్లల భవిష్యత్ కోసం అప్పుడప్పుడు కలుస్తోన్న సంగతి తెలిసిందే. అకీరానందన్ కథానాయకుడిగా ఎప్పుడు పరిచయమవుతాడు? అన్నదానిపై పవన్ కానీ రేణు కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అడివిశేష్ మేజర్ లో అకీరా అతిథిగా మెరుస్తాడని టాక్ ఉన్నా దానిపై స్పష్ఠత లేదు.