బిబి4 : ఫైనల్ 5 లో మొదటి కంటెస్టెంట్ అఖిల్

Sat Dec 05 2020 10:18:33 GMT+0530 (IST)

Akhil is the first contestant in Final 5

బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి మరో రెండు వారాలు ఉంది. ఎంత మంది హౌస్‌లోకి వెళ్లినా కూడా చివరి వారంలో ట్రోఫీకి పోటీ పడేది అయిదుగురు మాత్రమే. అయిదుగురు ఎవరై ఉంటారు అంటో గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ 5 లో ఉంటారు అనుకున్న వారు కొందరు ఇప్పటికే బయటకు వచ్చారు. ప్రస్తుతం హౌస్ లో మొత్తం 7 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం ఒకరు కానుండగా తదుపరి వారం మరొకరు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఆ అయిదుగురు ఫైనల్ వారంలో నిలుస్తారు. ఆ వారంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే విన్నర్‌గా నిలుస్తారు.ఫైనల్ 5 లో మొదటి స్థానం కోసం ఫినాలే మెడల్ టాస్క్ జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఆ టాస్క్ లో చివరకు సోహెల్ త్యాగం చేయడంతో అఖిల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అఖిల్ ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యాడు. కనుక ఆ నామినేషన్ నుండి సేవ్ అయితే ఫైనల్ 5 లో చోటు దక్కించుకున్నట్లే. అయితే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కనుక అఖిల్ చాలా ఈజీగా వచ్చే వారం నామినేషన్స్ ఎదుర్కోకుండానే ఫైనల్ 5 వీక్ లో అడుగు పెట్టబోతున్నాడు.

మొదటి కంటెస్టెంట్ గా  అఖిల్ ఫైనల్ 5 కు వెళ్లడం.. అవినాష్ ఈ వారం బయటకు వెళ్తున్న నేపథ్యంలో అరియానా.. అభిజిత్.. హారిక.. మోనాల్ మరియు సోహెల్ ల్లో ఒక్కరు తదుపరి వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన నలుగురు మరియు అఖిల్ లు కలిసి చివరి వారంలోకి అడుగు పెడతారు.