Begin typing your search above and press return to search.

అఖిల్‌ లక్కే లక్‌.. ఈ దెబ్బతో కమర్షియల్‌ హిట్‌ పక్కా

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:30 AM GMT
అఖిల్‌ లక్కే లక్‌.. ఈ దెబ్బతో కమర్షియల్‌ హిట్‌ పక్కా
X
అక్కినేని అఖిల్‌ ఇప్పటికే మూడు సినిమా ల్లో నటించాడు. మొదటి సినిమా అఖిల్‌ డిజాస్టర్‌ అవ్వగా రెండవ సినిమా హలో పర్వాలేదు అనిపించినా కమర్షియల్‌ గా నిరాశ పర్చింది. మిస్టర్ మజ్ను మిశ్రమ స్పందన దక్కించుకుంది. నాల్గవ సినిమా ప్రముఖ సంస్థ గీతాఆర్ట్స్ వారి బ్యానర్ లో రూపొందింది. దాంతో ఖచ్చితంగా అఖిల్‌ నాల్గవ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ లో స్టఫ్‌ ఉంటుందని అంతా నమ్ముతున్నారు. మూడు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌ లు పడితే ఏ కొత్త హీరో అయినా కోలుకోవడం అంత ఈజీ కాదంటారు. కాని అఖిల్‌ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.

మూడు సినిమాలు నిరాశ పర్చినా కూడా నాల్గవ సినిమా ను గీతా ఆర్ట్స్ లో చేశాడు. ఇక అయిదవ సినిమాను ఏకంగా స్టార్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా అఖిల్ తో సినిమాను షురూ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. అఖిల్‌ ఈ మూడు సినిమాల్లో ఖచ్చితంగా రెండు లేదా మూడు సినిమాలతో అయినా సక్సెస్ లు కొట్టే అవకాశం ఉందంటూ అక్కినేని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

అఖిల్‌ మొదటి మూడు సినిమాల విషయంలో నిరాశ పర్చినా కూడా లక్ వల్ల వరుసగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇతర హీరోలకు ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా వారి కెరీర్ విషయంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కాని అఖిల్‌ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్‌ కు తోడు లక్‌ కలిసి రావడం వల్ల పెద్ద బ్యానర్‌ లు స్టార్‌ డైరెక్టర్స్ అఖిల్‌ తో సినిమా లు చేస్తున్నారు. అక్కినేని వారి అభిమానులు అఖిల్‌ ను ఫ్యూచర్‌ స్టార్‌ గా భావించారు. వారు కోరినట్లుగానే అఖిల్‌ స్టార్‌ గా ఈ సినిమాలతో మారతాడేమో చూడాలి.