నటనకు నటన అందానికి అందంతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో అక్కినేని అఖిల్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సినిమాల్లోకి వచ్చిన అతడు.. ఆశించిన రీతిలో కెరీర్ను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. హీరోగా ఎన్నో చిత్రాలు చేసినా ఒక్క హిట్ను అందుకున్నాడు. దీనికతోడు ఇటీవలే వచ్చిన 'ఏజెంట్'తో అఖిల్ బిగ్గెస్ట్ డిజాస్టర్ను చవి చూశాడు.
కెరీర్కు బూస్ట్ ఇచ్చే భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న అఖిల్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ బాధ్యతను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మెగా హీరో.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న విక్రమ్తో కలిసి 'V Mega Pictures'ను స్టార్ట్ చేశాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'V Mega Pictures' బ్యానర్పై తొలి సినిమాను అక్కినేని అఖిల్తోనే చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
అంతేకాదు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థలో చాలా కాలంగా పని చేస్తోన్న అనిల్ తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టును అఖిల్ కోసం రామ్ చరణ్ దగ్గరుండి సెట్ చేసినట్లు సమాచారం.
'V Mega Pictures' బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ నటించే సినిమాను పాన్ ఇండియా రేంజ్లోనే తీస్తున్నారని అంటున్నారు. ఇక దీని కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు కూడా తెలిసింది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ 'V Mega Pictures' బ్యానర్లో కొత్త టాలెంట్ను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు రామ్ చరణ్ విక్రమ్ కలిసి చిన్న బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించబోతున్నారు. ఇలా ఇప్పటికే టాలెంట్ ఉన్న ఎంతో మంది నుంచి కథలను కూడా సేకరించినట్లు తెలిసింది. అలాగే కొందరు డైరెక్టర్లను కూడా గుర్తించారని టాక్.