Begin typing your search above and press return to search.

ఏజెంట్ ఎక్కడ… సౌండ్ లేకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   29 Jan 2023 11:00 AM GMT
ఏజెంట్ ఎక్కడ… సౌండ్ లేకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్
X
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్. అఖిల్ కెరియర్ లో హీరోగా వస్తున్న అదో సినిమా ఇది కావడం విశేషం. ఇక ఈ మూవీ కోసం హల్క్ తరహాలో హాలీవుడ్ హీరోల రేంజ్ లుక్ కి అఖిల్ మారిపోయాడు. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు.

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది కావడంతో చాలా అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంటట్స్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాలో మలయాళీ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

అంటే ఈ సినిమా రిలీజ్ కి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు ఏజెంట్ మూవీకి సంబంధించి ఎలాంటి బజ్ లేదు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న సినిమా అన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి సినిమాకి సంబందించిన కంటెంట్ తో రీచ్ అవుతూ ఉండాలి. మీడియాలో కూడా ఏజెంట్ మూవీ గురించి ఎక్కువ చర్చ జరిగేలా చేయాలి. తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన పఠాన్ సినిమాపై రెండు నెలల నుంది బజ్ నడుస్తుంది. ఈ కారణంగా నెగిటివ్ ప్రచారం నడుస్తున్న కూడా సినిమా సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

అలాంటింది ఇటు సురేందర్ రెడ్డికి, అటు అఖిల్ కి ఏజెంట్ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం ఏజెంట్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా ప్రమోషన్ కూడా యూజ్ చేయడం లేదు. అప్పుడప్పుడు అఖిల్ తన ఫోటోలతో కాస్తా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న అది టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. పాన్ ఇండియా లెవల్ లో బజ్ క్రియేట్ అయ్యి ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం ఈ రెండు నెలలు సినిమాకి వీలైనంత ఎక్కువగా మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. మరి దీనిపై సురేందర్ రెడ్డి ఎలా ముందుకి వెళ్తాడు అనేది చూడాలి.