‘ఆకాశవాణి’ టీమ్ గాడ్ ప్రామీస్

Sun Aug 02 2020 20:05:51 GMT+0530 (IST)

Akashvaani movie First Look was released on the occasion of Friends Day

రాజమౌళి మరియు కీరవాణి వారసులు మొదలు పెట్టిన చిత్రం ‘ఆకాశవాణి’. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుండి రాజమౌళి తనయుడు కార్తికేయ తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. దాంతో సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ సభ్యుల మద్య ఉన్న వివాదాలు అన్ని తొలగి పోవడంతో మళ్లీ సినిమా పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది.సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాల భైరవ ఈ చిత్రంకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల చేశారు. మోషన్ పోస్టర్ లో నటీ నటులను ఎవరిని రివీల్ చేయకుండా మర్రి ఊడలకు ఒక బాలుడు ఉగుతున్నట్లుగా ఆ పక్కన ఒక పాత కాలం రేడియోను కూడా పెట్టారు. మేకల మందను కాచే కుర్రాడు రేడియోలో ఆకాశవాణి వింటూ ఉండటంను ఈ మోషన్ పోస్టర్ లో చూడవచ్చు. మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉందంటూ టాక్ దక్కించుకుంది. ఇక సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేస్తాం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. గాడ్ ప్రామీస్ సినిమా థియేటర్ లోనే విడుదల చేస్తామంటూ మోషన్ పోస్టర్ లో పేర్కొన్నారు.