కింగ్ హీరోయిన్ విమానాశ్రయంలో ఇలా ప్రత్యక్షమైంది

Sat Mar 06 2021 08:00:01 GMT+0530 (IST)

Akansha Singh Latest Stunning Pose At Airport

చాలా కాలం తర్వాత ఒక అందమైన అమ్మాయి నా పక్కన హీరోయిన్ గా నటిస్తోంది! అంటూ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించిన వైనం అంత తేలిగ్గా మర్చిపోలేం. ఎవరా అందమైన అమ్మాయి? అంటే ఆకాంక్ష సింగ్. దేవదాస్ సినిమాలో నాగార్జున సరసన నటించింది. అందానికి అందం ఒడ్డు.. పొడవు అందమైన నవ్వు ఉన్న ఈ బ్యూటీ తెలుగు యూత్ కి బాగానే నచ్చేసింది.ఆకాంక్ష మ్యారీడ్ గాళ్. తన భర్త ఉద్యోగి.. అయితే పెళ్లి తర్వాత నటించడానికి ఆయనకేం అభ్యంతరం లేదు. ఆ సంగతిని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పింది. అంతే కాదు ఆకాంక్ష ఇదివరకూ అదే అక్కినేని కాంపౌండ్ లో సుమంత్ సరసన `మళ్లీ రావా` చిత్రంలో నటించింది. తర్వాత దేవ దాస్ లో అవకాశం దక్కింది. దేవదాస్ యావరేజ్ గానే ఆడడంతో ఆకాంక్షకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలేవీ రాలేదు. ప్రస్తుతం ముంబై సర్కిల్స్ లోనే ఈ అమ్మడు కనిపిస్తోంది.

స్టార్ హీరో అజయ్ దేవగన్.. రకుల్ లతో కలిసి మేడే అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా షూట్ ముగించి తిరిగి వస్తూ.. విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కిందిలా. టాప్ టు బాటమ్ బ్లాక్ లో ఆకాంక్ష అదరగొట్టింది. విమానాశ్రయం షేకయ్యేలా ఆకాంక్ష ఇచ్చిన ఎంట్రీకి అంతా ఫుల్ చిలౌట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మేడే హిట్టయితే ఈ భామకు కూడా మరిన్ని అవకాశాలొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.