Begin typing your search above and press return to search.

'ఖైదీ' రీమేక్ ను ఖ‌రారు చేసిన హీరో, విడుద‌ల తేదీ కూడా!

By:  Tupaki Desk   |   28 Feb 2020 5:30 PM GMT
ఖైదీ రీమేక్ ను ఖ‌రారు చేసిన హీరో, విడుద‌ల తేదీ కూడా!
X
గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్ లో త‌మిళ సినిమా 'ఖైదీ' రీమేక్ విష‌యంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సౌత్ లో ఆక‌ట్టుకున్న సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసే ఆస‌క్తి ఉన్న ప‌లువురు హీరోల పేర్లు ఈ విష‌యంలో వినిపించాయి. ఒక ద‌శ‌లో ఈ సినిమాను స‌ల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇది వ‌ర‌కూ కూడా సౌత్ లో హిట్టైన ప‌లు సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి హిట్లు కొట్టాడు స‌ల్మాన్. ఈ క్ర‌మంలో అత‌డి క‌న్ను కార్తీ న‌టించిన త‌మిళ సినిమా పై ప‌డిందేమో అని అంతా అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆ విష‌యంలో మ‌రో పేరు తెర మీద‌కు వ‌చ్చింది. అత‌డే అజ‌య్ దేవ‌గ‌ణ్. ఇత‌డికి కూడా ప‌లు సౌత్ సినిమాల‌ను రీమేక్ చేసిన అనుభ‌వం ఉంది. ఆ సినిమాలు విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు మ‌రో రీమేక్ కు రెడీ అయిపోయిన‌ట్టుగా ఉన్నాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు అజ‌య్ దేవ‌గ‌ణ్. త‌ను ఖైదీ రీమేక్ లో న‌టించ‌బోతున్న విష‌యం వాస్త‌వ‌మే అని తాజాగా ప్ర‌క‌టించాడు ఈ బాలీవుడ్ హీరో.

అలాగే ఈ సినిమా విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి మూడో వారానిక‌ల్లా ఈ సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా అజ‌య్ ప్ర‌క‌టించాడు. ఇలా ఖైదీ హిందీ రీమేక్ ప‌ట్ల అధికారిక ధ్రువీక‌ర‌ణ వ‌చ్చింది. ఊహాగానాల‌కు తెర‌దించుతూ ఆ సినిమాను త‌నే రీమేక్ చేస్తున్న‌ట్టుగా ఈ బాలీవుడ్ హీరో ప్ర‌క‌టించుకున్నాడు.

ఇక ఇది వ‌ర‌కూ దృశ్యం, సింగం వంటి సినిమాల‌ను అజ‌య్ హిందీలో రీమేక్ చేశాడు. అవి ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా ఖైదీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.