అజయ్ దేవగన్ తన ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్టైనర్ భోళాతో నిన్న శ్రీరామనవ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తీ ఖైదీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మాస్ సినిమా కావడంతో భోళా భారీ కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు ఎందుకంటే నిన్న శ్రీరామనవమి సందర్భంగా సెలవు కూడా కలిసి రావడంతో ఈ సినిమా దాదాపు 16 నుంచి 18 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు. కానీ సెలవు రోజు అయినప్పటికీ ఆ సినిమా వసూళ్ల విషయంలో ఎక్కడా జోరు కనపడలేదు.
మాస్ ఏరియల్ గా భావిస్తున్న కొన్నిచోట్ల నుంచి పరువు దక్కించుకోగలిగే వసూళ్లు రాబట్టిన సరే ముంబై ఢిల్లీ సహా సౌత్ లో కూడా ఈ సినిమా వసూళ్లు చాలా చప్పగా ఉన్నాయి.
తొలిరోజు ఈ సినిమా 10-11 కోట్లు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు. 3D - 4DX వెర్షన్ల కోసం అధిక టిక్కెట్ ధరలు లేకుంటే ఈ చిత్రం ఆ పది కోట్ల వరకు కూడా వచ్చేది కాదేమో అని విశ్లేషనలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల క్రితం ఇదే తేదీన (మార్చి 29) అజయ్ దేవగన్ నటించిన హిమ్మత్ వాలా విడుదలైంది. ఈ సినిమాకి దారుణమైన రివ్యూలు రావడం అంతకన్నా దారుణమైన మౌత్రాకు బయటకు రావడంతో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ సినిమా దాదాపు తొలిరోజు 12 కోట్ల వసూళ్లు రాబట్టింది.
అంటే ఆ 12 కోట్లు కూడా రాబట్టుకోలేక బోండా సినిమా వెనకబడిందంటే ఇదొక దారుణమైన పరిస్థితి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన 'భోలా' వీకెండ్లో భోళా పుంజుకుంటుందో లేక రానున్న రోజుల్లో డ్రాప్ను ఎదుర్కొంటుందో చూడాలి. శని ఆదివారాల కలెక్షన్స్ చూస్తే ఆ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.