బిగ్ బ్రేకింగ్ : ఐశ్వర్యారాయ్ కి కరోనా పాజిటివ్...!

Sun Jul 12 2020 17:40:00 GMT+0530 (IST)

Aishwarya Rai Tests Positive For The Virus

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో బచ్చన్ ఫ్యామిలీలోని ఇతర కుటుంబ సబ్యులకు.. డ్రైవర్లకు పని వారికి అందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కోడలు అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఐశ్వర్యారాయ్ తో పాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని కంఫర్మ్ అయింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ప్రముఖులందరూ వారు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ పెడుతున్నారు.అమితాబ్ ఫ్యామిలిలో ఇప్పటికే నలుగురికి కరోనా సోకడంతో అమితాబ్ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. ఇక అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కి మాత్రం కరోనా నెగిటివ్ అని తేలింది. ఇంకా ఇంట్లో పని చేసిన వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అమితాబ్ - అభిషేక్ ట్రీట్‌మెంట్ కోసం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని నానావతి ఆస్పత్రి ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. బచ్చన్ ఫ్యామిలీ మెంబెర్స్ కరోనా వైరస్ భారిన పడటంతో టాలీవుడ్ స్టార్స్ కూడా వారు త్వరగా కొలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.