క్వీన్ నందిని.. ప్రతీకారానికి అందమైన రూపం!

Wed Jul 06 2022 14:00:00 GMT+0530 (IST)

Aishwarya Look From Ponniyan Selvan

రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన 'బాహుబలి' పీరియాడికల్ మూవీస్ ని తెరపైకి తీసుకురావాలని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఎంతో మంది దర్శకులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. దీంతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ లార్జర్ దెన్ లైఫ్ సినిమాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే పలు సినిమాలు నిర్మాణ దశలో వున్నాయి. ఇందులో దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి. గత కొంత కాలంగా కల్కీ కృష్ణమూర్తి రాసిన ఫేమస్ నవల 'పొన్నియన్ సెల్వన్'ఆధారంగా అదే పేరుతో భారీ మూవీని తెరపైకి తీసుకురావాలని మణిరత్నం విశ్వప్రయత్నాలు చేశారు.ఫైనల్ గా లైకా ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో వారితో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై చోళ ఎంపైర్ నేపథ్యంలో ఈ మూవీని రెండు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ ని PS - 1 గా సెప్టెంబర్ 30న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

చియాన్ విక్రమ్ తో పాటు కీలక తారాగణం మొత్తం ఈ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ రిలీజ్ మరో రెండు నెలలు వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.

తాజాగా విక్రమ్ లుక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో విక్రమ్ ఛోళరాజు ఆదిత్య కరికాళన్ గా నటిస్తున్నాడు. ఆ తరువాత కార్తి లుక్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇందులో కార్తి వల్లవరాయన్ వందియదేవన్ గా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరి లుక్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బుధవారం ఐశ్వర్యారాయ్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్రలో పళువూర్ క్వీన్ నందినిగానూ కనిపించబోతోంది. బుధవారం మేకర్స్ ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. యువరాణి నందినిగా ఐశ్వర్యారాయ్ ఈ మూవీలో కనిపించబోతోంది.  

'ప్రతీకారానికి అందమైన ముఖం..ఇదుగో పజువూరు రాణి నందిని'అంటూ మేకర్స్ ఈ పాత్రని పరిచయం చేశారు. ఐశ్వర్య అందంగా కనిపిస్తున్నా ప్రతీకారం కోసం రగిలిపోయే మహారాణిగా ఆమె పాత్ర ఇందులో చాలా ప్రత్యేకంగా వుంటుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. రాజసం ఉట్టిపడేలా ఆభరణాలతో ముగ్ధమనోహరమైన రూపంతో.. తీక్షణమైన చూపులతో కనిపిస్తున్న ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంటోంది.