Begin typing your search above and press return to search.

వ‌ల‌ విసురుతోంది స‌రే.. చేప చిక్క‌దేమీ?

By:  Tupaki Desk   |   31 March 2022 3:30 AM GMT
వ‌ల‌ విసురుతోంది స‌రే.. చేప చిక్క‌దేమీ?
X
అందానికి అందం ట్యాలెంటు ఉన్నా కానీ కొంద‌రికి ల‌క్ క‌లిసి రాదు. ఆ కోవ‌కే చెందుతుంది ఈ బ్యూటీ. శ‌ర్మా సిస్ట‌ర్ గా పాపుల‌రైన ఐషా శ‌ర్మ ఇప్పుడిప్పుడు బాలీవుడ్ లో బుడిబుడి అడుగులు వేస్తోంది. పెద్ద హీరోల స‌ర‌స‌న ఇంకా అవ‌కాశాల్లేవ్. జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న ఒక సినిమా చేసింది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాల్లో ఐషా శ‌ర్మ హ‌వా గురించి తెలిసిందే. ఒంపుసొంపుల్ని రంగ‌రించి యూత్ ని ఫాలోవ‌ర్స్ ని త‌న ఖాతాలోకి మ‌ళ్లించేస్తోంది. ఐషా షేర్ చేసిన ఓ క‌ర్వీ ఫోటోగ్రాఫ్ కుర్ర‌కారుకు కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదు. పూర్తి అథ్లెటిక్ లుక్ లో క‌నిపిస్తున్న ఈ బ్యూటీ టూ హాట్ గా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

త‌న సోద‌రి నేహాశ‌ర్మ కంటే చాలా ఆల‌స్యంగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చినా ఈ బ్యూటీ వేడెక్కించే స్టింట్ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఐషా శ‌ర్మ హాట్ ఫోటోషూట్లు వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. క‌ర్లీ హెయిర్.. టోన్డ్ లెగ్స్ .. థై అందాల‌తో ఐషా ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించే ఈ బ్యూటీలో ఏదో మ్యాజిక్ ఉంది. కానీ అది అవ‌కాశాల ప‌రంగా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.

స్వ‌త‌హాగానే అథ్లెట్ కం సైక్లిస్ట్ కాబ‌ట్టి శ‌ర్మా గాళ్ నిగ‌నిగ‌ల నిగారింపు మ‌రింత‌గా దోర‌గా అందాల్ని వేయిస్తున్నా ప‌ని పూర్త‌వ్వ‌డం లేదు. ఐషా అందాల వ‌ల‌కు చిక్క‌ని మ‌గాడెవ‌రు? అంటూ మ‌రికొంద‌రు వేడెక్కిపోతున్నారు. స‌త్య‌మేవ జ‌య‌తే-2 లాంటి క్లాసిక్ త‌ర్వాత శ‌ర్మా గాళ్ మ‌రో క్రేజీ అవ‌కాశం కోసం వేచి చూస్తోంది. వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. మ‌రోవైపు సోద‌రితో క‌లిసి వ‌రుస ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తోంది. వాటిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఆర్జిస్తోంది.