'అహింస' హడావుడి ఎక్కడ సారూ..!

Sat Apr 01 2023 17:13:15 GMT+0530 (India Standard Time)

Ahmisa Cinema Updates

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కుటుంబాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి అనడంలో సందేహం లేదు. అలాంటి ఫ్యామిలీ నుండి ఒక హీరో రాబోతున్నాడు అంటే హడావుడి ఓ రేంజ్ లో ఉండాలి కానీ దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా కూడా పెద్దగా హడావుడి కనిపించక పోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ మధ్య ఈ సినిమాను ఏప్రిల్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో సినిమా కచ్చితంగా ఉంటుందని అన్నారు. ఏప్రిల్ నెల వచ్చేసింది.. ఈ నెలలో ఏ వారం ఏ తేదీన ప్రేక్షకుల ముందుకు అహింస ను తీసుకొస్తారనే విషయంలో క్లారిటీ లేదు. పైగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా స్పీడ్ అవ్వలేదు.

ఇప్పటికే విడుదల చేసిన పాటలు.. టీజర్ మరియు పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కనుక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాలని భావించాడు.

కొన్ని కారణాల వల్ల.. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా అహింస చిత్రం తో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కావడం వల్ల వెంకటేష్.. రానా ఇంకా నాగచైతన్య కూడా అహింస చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వారు ఎవ్వరు కూడా పెద్దగా స్పందించలేదు.

మీడియా ముందుకు రాలేదు. సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయితే వారంతా కూడా ప్రమోషన్ కోసం ముందుకు వచ్చే అవకాశం ఉంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.