Begin typing your search above and press return to search.

టు-పీస్ బికినీ ట్రీట్ తో ఆహా.. అనిపిస్తున్న అహనా!

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:30 AM GMT
టు-పీస్ బికినీ ట్రీట్ తో ఆహా.. అనిపిస్తున్న అహనా!
X
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ షో పరంగా.. హాట్ హాట్ అందాల విందు పరంగా బాలీవుడ్ బ్యూటీలే ముందుంటారనే విషయం తెలిసిందే. అయితే సినిమా అనే గ్లామర్ ఫీల్డ్ లో ఉండేసరికి హీరోయిన్స్ - క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ ఏజ్ అనేది దృష్టిలో పెట్టుకోకుండా హాట్ షోకు సిద్ధం అవుతుంటారు. అందులోను పెళ్లి అయినా కాకపోయినా ఏ ఏజ్ లో అయినా సారీ నుండి టు-పీస్ బికినీ వరకు వేసేందుకు రెడీగా ఉంటున్నారు. మాములుగా బికినీ షో అనేది హీరోయిన్స్ నుండే ఎక్సపెక్ట్ చేస్తాం. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి పట్టింపులు ఏం లేవు. ఎవరికి కెమెరా ముందు బికినీ వేసే ఛాన్స్ వస్తే వారు హ్యాపీగా వేసేస్తారు.

అయితే తాజాగా 36ఏళ్ల బాలీవుడ్ సోయగం.. టు-పీస్ బికినీ వేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆమె ఎవరో కాదు లక్నోకు చెందిన అహనా కుమ్రా. ఈ బ్యూటీ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో.. మోడలింగ్ లో మాత్రం కీలకపాత్రే పోషిస్తుంది. ఎల్లప్పుడూ హాట్ హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును అల్లాడిస్తుంది. చూస్తే నాజూకు ఫిగర్ తో మగాళ్లకు మతిపోగొట్టే అందం ఒంపులన్ని అహనాలో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. అయితే సినిమాలతో పాటు అహనా.. బాలీవుడ్ ప్రేక్షకులకు సీరియల్స్ - వెబ్ సిరీస్ - టీవీ ప్రోగ్రాంస్ ద్వారా బాగానే సుపరిచితం.

అయితే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన అహనా.. తర్వాత మెల్లగా టీవీ షోస్ నుండి సినిమాల్లోకి రంగప్రవేశం చేసింది. అమ్మడికి సోషల్ మీడియాలో కూడా సూపర్ ఫాలోయింగ్ కలిగి ఉంది. దాదాపు ఇంస్టాగ్రామ్ లో ఈ కుమ్రా అందాలకు 12లక్షలకు పైగానే ఫాలోయర్స్ ఉన్నారు. ఆ రేంజిలో ఆకట్టుకుంటుంది ఈ ముప్పై ఆరేళ్ళ కుమారి. అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను తన వేడెక్కించే అందాలతో హీటెక్కిస్తుంది. తాజాగా ఈ వయ్యారి స్విమ్మింగ్ పూల్ వద్ద టు-పీస్ బికినీ ధరించి ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేసరికి కుర్రాళ్ళలో అందమైన చిచ్చు రగులుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బికినీ ట్రీట్ తో అహనా ఆహా అనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడు శంషేరా అనే సినిమాలో నటిస్తుంది.