ఆహా! MBతో బాలయ్య అన్ స్టాపబుల్

Sat Dec 04 2021 19:21:38 GMT+0530 (IST)

Aha Balayya Unstoppable with MB

AHA వేదికగా ఎన్.బి.కే అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి. ఈ కార్యక్రమానికి ఓటీటీలో గొప్ప ఫాలోయింగ్ ఏర్పడింది. బాలయ్య బాబు స్పాంటేనియస్ పంచ్ లు జోక్ లతో షో ఆద్యంతం రసకందాయంగా సాగుతుండడంతో ప్రతి ఒక్కరూ దానిని ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ బాబు - మంచు కుటుంబం సహా నాని తదితరులతో ఎపిసోడ్స్ ఆసక్తిని రేకెత్తించడమే గాక వినోదాన్ని పంచాయి.ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో బాలయ్య బాబు అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సమయమాసన్నమైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వేడెక్కిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. మహేష్ బ్లూ జీన్స్ బ్లూ టీషర్ట్ తో ఎంతో స్మార్ట్ గా కనిపిస్తుండగా హోస్ట్ బాలయ్య బాబు వేషధారణ అంతే ఇస్మార్ట్ గా కనిపిస్తోంది.

మహేష్ తో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైందని సమాచారం. మహేష్ బాబు రీసెంట్ గా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు? షోలో పాల్గొని సక్సెస్ చేశారు. మహేష్ బాబు తో ఎన్బీకే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారమయ్యే అవకాశం ఉంది. ఈరోజు- రేపటితో స్టూడియోలో షూటింగ్ పూర్తి కానుందట. భుజం గాయం కారణంగా చిన్న విరామం తీసుకున్న మహేష్ .. బాలకృష్ణ షోకి సహకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సూపర్ సక్సెస్ సాధించింది. మాస్ లో బాస్ అని బాలయ్య నిరూపించడం పరిశ్రమకు ఉత్సాహాన్నిచ్చింది.