Begin typing your search above and press return to search.
'ఏజెంట్'... ముగిసిన పెళ్లికి బజాలు ఎందుకు?
By: Tupaki Desk | 30 May 2023 10:25 AMఅక్కినేని ఫ్యామిలీ హీరోలకు గడ్డు కాలం నడుస్తోంది. మొత్తం ఫ్యామిలీకే బ్యాడ్ టైమ్ నడుస్తుందేమో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే. అక్కినేని ఫ్యామిలీ బ్యాడ్ టైమ్ ఏమో కానీ సినిమా కు పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వకుండా షూటింగ్ కి వెళ్లడం వల్లే ఫ్లాప్ అయ్యింది యూనిట్ సభ్యులు ఒప్పుకున్నారు.
స్క్రిప్ట్ వర్క్ మాత్రమే కాకుండా సరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేయలేదు అంటూ యూనిట్ సభ్యులు అన్నారు. థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం యూనిట్ సభ్యులు మళ్లీ సమయం తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట.
ఆ మధ్య ప్రముఖ ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ ప్రకటన వచ్చింది. కానీ ఆ రోజు స్ట్రీమింగ్ అవ్వలేదు. ఒకటి రెండు లేదా వారం రోజుల్లో ఏజెంట్ సినిమా వస్తుందని అంతా భావించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా నెల రోజుల తర్వాత మాత్రమే అంటే జూన్ చివర్లో మాత్రమే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
థియేట్రికల్ రిలీజ్ కు ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ముఖ్యంగా ఎడిటింగ్ కు ఎక్కువ సమయం లభించలేదట. దాంతో ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ లో ఏజెంట్ సినిమా తో యూనిట్ సభ్యులు కుస్తీ పడుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేదు కానీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యంకు అదే కారణం అనే చర్చ జోరుగా సాగుతోంది.
జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం. ఓటీటీ ద్వారా విడుదల అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ ఏమైనా వచ్చేది తప్పిందా అంటూ కొందరు అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముగిసిన పెళ్లి కి బజాల పేరుతో సమయం వృధా చేయడం తప్ప మరేం లేదని.. వెంటనే ఏజెంట్ ను స్ట్రీమింగ్ చేయడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్ట్రీమింగ్ ఆలస్యంకు కారణంపై ఏజెంట్ మేకర్స్ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదే నిజం అయ్యి ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.