ఏజెంట్ రొమాంటిక్ లుక్.. అదిరింది!

Wed Mar 22 2023 10:32:25 GMT+0530 (India Standard Time)

Agent Romantic Look

అఖిల్ అక్కినేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అఖిల్ అనే సినిమాతో 2015లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. మరో మూడు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. తాజాగా ఆయన ఏజెంట్ అని సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉగాది పండుగను పురస్కరించుకొని అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఏందే ఏందే సాంగ్ ప్రోమోను ఈరోజు సాయంత్రం 5.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.అంతే కాకుండా పూర్తి పాటను మార్చి 24వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. చిత్రబృందం తరఫున సినీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏందే ఏందే సాంగ్ ప్రోమో పోస్టర్ పై అఖిల్ లుక్ అదిరిపోయింది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి వైద్య.. అఖిల్ ను హగ్ చేసుకొని ఉంది. ఇద్దరూ బ్లూ కలర్ డ్రెస్సుల్లో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపించారు. కర్లీ అండ్ లాంగ్ హెయిర్ లో అఖిల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. నల్ల దారానికి కట్టి ఉన్న యాంకర్ ను అఖిల్ మెడలో వెేసుకున్నాడు. అది చాలా బాగ్ హైలెట్ అయింది.

అలాగే హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా రొమాంటిక్ స్మైల్ ఇచ్చింది. ఒకరినొకరు హత్తుకొని.. కళ్లలోకి చూస్కునే ఈ ఫొటో చాలా బాగుంది. అఖిల్ ఫ్యాన్స్ అంతా ఈ పోస్టర్ ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా అదిరిపోయే లవ్ ట్రాక్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా గత నెలలోనే రిలీజ్ అయింది.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా... నవీన్ నూలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం సినీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.