Begin typing your search above and press return to search.
ఒసామా బిన్ లాడెన్...గడాఫీ..హిట్లర్ పంపాడు బే
By: Tupaki Desk | 4 Feb 2023 2:34 PMయంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో అఖిల్ కెరీర్ లోనే మునుపెన్నడూ చేయని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వరుస రీ షూట్ ల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా వారి నిరీక్షణ ఫలించింది. ఫైనల్ గా 'ఏజెంట్' టీమ్ అక్కినేని అభిమానులకు శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా అదుగో ఇదుగో అంటూ ఊరిస్తూ వస్తున్న 'ఏజెంట్' మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసింది. భారీ బడ్జెట్ తో చేసిన పాన్ ఇండియా మూవీ కాబట్టి సమ్మర్ బరిలో దిగితేనే పర్ ఫెక్ట్ గా వుంటుందని భావించిన మేకర్స్ ఫైనల్ గా 'ఏజెంట్' ని సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించేశారు.
శనివారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఓ వైల్డ్ వీడియోని కూడా అభిమానులతో పంచుకుంది. అఖిల్ ముఖానికి మాస్క్ తో కవర్ చేసి ఓ ఛైర్ లో కూర్చో బెట్టి నీ పేరేంటో చెప్పు అంటూ వైల్డ్ గా ఓ వ్యక్తి టార్చర్ చేస్తున్నాడు. ఒళ్లంతా రక్తం ఓడుతున్నా తనేవరో చెప్పకుండా ఎదుటి వ్యక్తి సహనాన్ని పరీక్షిస్తున్నాడు. కరుడు గట్టిన సదరు వ్యక్తి మళ్లీ 'పోలీసా... రా నా..ఎనీ ఏజెన్సీ...ఈ నెట్ వర్క్ లోకి నిన్ను ఎవడు పంపాడ్రా..?అని ప్రశ్నిస్తుంటే..
ఒసామా బిన్ లాడెన్...గడాఫీ..హిట్లర్ పంపాడు బే.. అని అఖిల్ సమాధానం చెప్పడం..ఆ సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన సదరు వ్యక్తి 'సాలే బోల్.. బోల్ సాలే.. అని పిడిగుద్దులు కురిపించడం.. ఆ వెంటనే అఖిల్ ముఖం అంతా రక్తంతో 'సాలే నహీ వైల్డ్ సాలే బోల్' అంటూ తనని తాను అభివర్ణించుకుంటూ వైల్డ్ గా రియాక్ట్ అవుతున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ వీడియోతో సినిమాలో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా వుండబోతోందో జస్ట్ షాంపిల్ గా చూపించినట్టుగా వుంది.
సినిమా కోసం శారీరకంగా అఖిల్ కఠోరంగా శ్రమించినట్టుగా తెలుస్తోంది. సినిమాలో డిఫరెంట్ మేకోవర్ తో కనిపించడానికి అఖిల్ సిక్స్ ప్యాక్ చేశాడు. అంతే కాకుండా తన క్యారెక్టర్ మేకోవర్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అఖిల్ ఇందులో లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. హిప్ అప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి వక్కంతం వంశీ స్టోరీని అందివ్వగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.