Begin typing your search above and press return to search.

ఏజెంట్.. బడ్జెట్ పెరిగినా బజ్ లేదు

By:  Tupaki Desk   |   21 March 2023 12:00 PM GMT
ఏజెంట్.. బడ్జెట్ పెరిగినా బజ్ లేదు
X
అఖిల్ అక్కినేని తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్ గురించి అందరికీ తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమ్మర్ కు అయినా తీసుకు వస్తారా లేదా అనే సందేహం నెలకొంది.

అయితే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయిందని, కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిందని మూవీ టీం చెబుతోంది. అయితే ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాకు ఉన్న సమస్యల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

డైరెక్టర్ సురేందర్ రెడ్డికి, ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలస్తోంది. అయితే ముందుగా అనుకున్న బడ్జెట్ 40 కోట్ల రూపాయలు కాగా దర్శకుడు 70 కోట్ల రూపాయల డబ్బులను ఖర్చు చశాడట.

దీంతో అనిల్ సుంకర తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు జరిగినట్లు అంతా భావిస్తున్నారు. బడ్జెట్ సమస్యలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోందని అంతా అనుకుంటున్నారు.

ఏజెంట్ చిత్రంలో ఏర్పడ్డ సమస్యల కారణంగా... కొన్ని నెలల పాటు చిత్రీకరణను నిలిపివేశారు. ఎట్టకేలకు మళ్లీ ప్రారంభించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్లు, సందడి చేయట్లేదు చిత్రబృందం. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ ఫ్యాన్స్.. అనిల్ సుంకరపై ఫైర్ అవుతున్నారు. సినిమాను సరైన రీతిలో ప్రమోషన్లు చేయాలని... విడుదలను పక్కాగా ప్లాన్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

"ఏజెంట్" ప్రారంభ బడ్జెట్ రూ. 40 కోట్లు కాగా... అది ఇప్పుడు రూ.70 కోట్లకు పెరిగిందట. సురేందర్ రెడ్డి కో-ప్రొడ్యూసర్ కూడా, పెట్టుబడిని రికవరీ చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో. ఏది ఏమైనా అసలే హిట్టు చిత్రాలు లేక వెలవెలబోతున్న అఖిల్ చిత్రానికే ఇలాంటి సమస్యలు రావడం నిజంగా అక్కినేని ఫ్యాన్స్ కు చేదువార్తే. మరి చూడాలి ఏం జరగనుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.