ఏజెంట్ అఖిల్ మాస్ హీరోగా ప్రమోట్ అవుతాడా..?

Mon Feb 06 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Agent Akhil will be promoted as a Mass Hero..?

అక్కినేని హీరో అఖిల్ లీడ్ రోల్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్నారు. అసలైతే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఫైనల్ గా ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఒక టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అఖిల్ పూర్తిస్థాయి మాస్ హీరోగా మారేందుకు ఏజెంట్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.అఖిల్ మొదటి సినిమా అఖిల్ తోనే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూశాడు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఇక అందుకే లవర్ బోయ్ గా మిగతా 3 సినిమాలు చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా ఏజెంట్ తో స్టార్ ఇమేజ్ పై గురి పెట్టాడు.

అందుకే మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను చాలా ఫోకస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ లేట్ అవడం వల్ల కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చింది.

అయితే చిత్ర యూనిట్ ఏజెంట్ సినిమాను ప్రేక్షకులు మర్చిపోతున్నారు అనుకునే టైం లో ఏదో ఒక టీజర్ తోనో పోస్టర్ తోనో సర్ ప్రైజ్ చేస్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో దాదాపు ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఏజెంట్ కేవలం తెలుగు మాత్రమే కాదు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. అనుకున్న విధంగా క్లిక్ అయితే మాత్రం అఖిల్ పంట పడినట్టే లెక్క.

అఖిల్ ఏజెంట్ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ సూపర్ గా ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అఖిల్ తన సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

అక్కినేని హీరోలంతా కూడా క్లాస్ ఇమేజ్ తో కెరీర్ నెట్టుకొస్తున్నారు. అఖిల్ మాత్రం మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఏజెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం అఖిల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్టే లెక్క. అక్కడ ఉంది సురేందర్ రెడ్డి కాబట్టి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సైరా నరసింహా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి మరోసారి ఏజెంట్ తో తన సత్తా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.