Begin typing your search above and press return to search.

ఎప్పటిలాగే థియేటర్స్ కి జనాలు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటో...!

By:  Tupaki Desk   |   17 Sep 2020 5:30 PM GMT
ఎప్పటిలాగే థియేటర్స్ కి జనాలు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటో...!
X
కరోనా కారణంగా బాగా నష్టపోయిన రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. అన్‌ లాక్‌ లో భాగంగా షాపింగ్‌ మాల్స్ - విమాన సర్వీసులు - రైల్వేలు - బస్సులు - మెట్రో - హోటళ్లు - జిమ్‌ ల వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే సినిమా థియేటర్లు మల్టీప్లెక్సెస్ తెరుచుకోవడానికి మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. థియేటర్స్ ఇప్పట్లో తెరుస్తారో లేదో.. ఒకవేళ థియేటర్స్ తెరిచినా ఒకప్పటిలా జనాలు సినిమా చూడటానికి వస్తారో లేదో అని భావించిన మేకర్స్ తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో మరికొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తే.. ఇంకొన్ని ప్రముఖ ఓటీటీలతో డీల్స్ కుదుర్చుకున్నాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఓటీటీతో డీల్స్ కుదుర్చుకున్న సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా, థియేటర్లను త్వరగా తెరిచేలా చూడాలంటూ దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. 'అన్‌ లాక్‌ సినిమాస్‌.. సేవ్‌ జాబ్స్‌' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని థియేటర్లను తెరిస్తే మంచిదని.. ఇప్పటికే విదేశాల్లో జాగ్రత్తలు తీసుకొని థియేటర్లను తెరిచారని.. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని.. ఇక్కడ కూడా ప్రభుత్వం త్వరగా థియేటర్లను తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి థియేట‌ర్స్ తెరిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసి జనాలు ఎప్పటిలాగే సినిమా చూడటానికి క్యూలు కడితే ఓటీటీ డీల్స్ చేసుకున్న వారి సిచ్యుయేషన్ ఏంటో అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే కొన్ని సినిమాలు ఓటీటీ అగ్రిమెంట్ లోనే తమ సినిమాని థియేటర్స్ రీ ఓపెన్ చేశాక మళ్ళీ థియేటర్ రిలీజ్ చేసుకుంటామనే కండిషన్ పెడుతున్నారట. మరి ఈ మధ్య ఓటీటీ డీల్స్ సెట్ చేసుకున్న తెలుగు సినిమాలు అలాంటి కండిషన్స్ పెట్టుకున్నాయో లేదో..!