Begin typing your search above and press return to search.

మ‌హేష్ మునుపెన్న‌డూ చేయ‌ని అడ్వెంచ‌ర‌స్ ఫైట్స్

By:  Tupaki Desk   |   20 Jun 2021 2:30 AM GMT
మ‌హేష్ మునుపెన్న‌డూ చేయ‌ని అడ్వెంచ‌ర‌స్ ఫైట్స్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని స‌ర్కార్ వారి పాట చిత్రంలో మునుపెన్న‌డూ చూడ‌నంత కొత్త‌గా క‌నిపించ‌నున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అత‌డి పాత్ర‌లో మాస్ ఎలివేష‌న్ మ‌రో లెవ‌ల్లో ఉండ‌నుంది. ఇక ఈ మూవీలో మునుపెన్న‌డూ చేయ‌ని భారీ స్టంట్స్ తో మ‌హేష్ అల‌రించ‌నున్నార‌ని ఫైట్ మాస్ట‌ర్లు రామ్ ల‌క్ష్మ‌ణ్ తాజా ఇంట‌ర్వ్యూలో ధృవీక‌రించారు.

ఇంత‌కుముందు మ‌హేష్ స‌హా కీల‌క తారాగ‌ణంపై దుబాయ్ లో కీల‌క షెడ్యూల్ ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ కీల‌క స‌న్నివేశాలు.. పాట‌లు స‌హా ఫైట్‌ ని చిత్ర‌బృందం తెర‌కెక్కించింది. మ‌హేష్ చేసిన భారీ ఫైట్ చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని తెలిసింది. దుబాయ్ పోరాట సన్నివేశం అసాధారణమైనదని మహేష్ బాబు అభిమానులు కంగారు పడేంత‌గా థ్రిల్ కి గురి చేస్తుంద‌ని ఫైట్ మాస్టర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.

కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన స్టంట్స్ ని కొరియోగ్రాఫ్ చేసాం. కానీ వాటికి భిన్నంగా స‌ర్కార్ వారి పాట‌లో ప్ర‌తిదీ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ అనుభవం మాక్కూడా కొత్తది. మొదటిసారి కొత్త బృందం తో కలిసి పనిచేసినా యూనిక్ గా ప్రయత్నించాం అని రామ్-లక్ష్మణ్ చెప్పారు. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ స్టైల్ ప్ర‌తిదీ కొత్త‌గా ఉంటాయ‌ని తెలిపారు. మునుపెన్న‌డూ మ‌హేష్ ఇలాంటి స్టంట్స్ చేయ‌లేద‌ని వారు చెబుతున్నారు.

జూలైలో స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. సుదీర్ఘ మైన షెడ్యూల్ లో మెజారిటీ భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌నున్నారు. ఇందులో కన్నడ నటుడు అర్జున్.. మహేష్ బాబుల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరించనున్నారు. బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ పాత్ర ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.