మరో నిర్మాత వద్ద అడ్వాన్స్... దీంతో అరడజను

Wed Apr 21 2021 12:00:01 GMT+0530 (IST)

Advance at another producer ...

పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి తర్వాత దాదాపుగా మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఆ సమయంలో పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తాడా లేదా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. పవన్ ఆర్థిక అవసరాల కోసం అంటూ సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఇతరత్ర కారణాల వల్ల పవన్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇటీవలే పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మళయాల మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ ను రానాతో కలిసి నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.అధికారికంగా ప్రకటన వచ్చిన సినిమాలు కాకుండా అనధికారికంగా ఇప్పటికే బండ్ల గణేష్ నిర్మాణంలో ఒక సినిమాను పవన్ చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా మరి కొన్ని సినిమాలకు కూడా పవన్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత జె పుల్లారావు నిర్మాణంలో పవన్ ఒక సినిమాను చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా నిర్మాత పుల్లారావు చెప్పుకొచ్చాడు. పవన్ కోసం ఇప్పటికే తాము కథ సిద్దం చేయించాము. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే మా సినిమాను చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అంటే పుల్లారావు భగవాన్ ల నిర్మాణంలో పవన్ సినిమా చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం అయినా పట్టే అవకాశం ఉందంటున్నారు. అంతకు ముందే పవన్ డేట్లు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరి బ్యానర్ లో సినిమా తో కలిపి పవన్ మొత్తంగా ఆరు సినిమాలను లైన్ లో పెట్టాడు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా పవన్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.