Begin typing your search above and press return to search.

శేష్.. ఆ ట్వీట్ కి అర్థమేంటి?

By:  Tupaki Desk   |   30 May 2023 1:00 PM GMT
శేష్.. ఆ ట్వీట్ కి అర్థమేంటి?
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ కూడా ఒకరు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగాడు. హీరో అయిన తర్వాత, తన ముందుకు వచ్చిన అన్ని కథలను ఓకే చేసి ఓ మూస పద్దతిలో వెళ్లకుండా, సెలక్టివ్ కథలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

అడవి శేష్ హీరో అంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఎప్పుడో ఏర్పడింది. ఇక అడవి శేష్ సినిమా అంటే ఏదో ఒక ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది..అలాంటి కథలే ఆయన ఎంచుకుంటారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.

ఈ క్రమంలోనే ఆయన వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజా గా హిట్ 2 తో హిట్ కొట్టాడు. దీంతో తదుపరి సినిమా ఏంటా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆయన గుడాఛారి సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా, తాజాగా ఆయన తన ఫ్యాన్స్ ముందు ఓ పజిల్ ఉంచారు.

పజిల్ అంటే ఏదో మనల్ని సాల్వ్ చేయమంటూ ఓ ప్రశ్న పెట్టారు అనుకుంటే పొరపాటే. ఆయన తన జీవితానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ కి అర్థం ఏంటో తెలియక నెటిజన్లు జుట్టుపీక్కుంటున్నారు.'వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ కి అర్థమేంటి? ఆయన ఆ ట్వీట్ ఎందుకు చేశారు అనే అనుమానం మొదలైంది. ఏదైనా మూవీ గురించి అప్ డేట్ ఇస్తున్నారా లేక క్యాజువల్ ఏమైనా ట్వీట్ చేశారా అంటూ నెట్టింట చర్చ మొదలైంది.

అయితే, ఈ ట్వీట్ కి రాహుల్ రవీంద్రన్ స్పందించారు. వెన్నెల కిశోర్ ని ట్యాగ్ చేసి, మన గురించే మాట్లాడుతున్నాడా అంటూ పేర్కొన్నారు. దానికి వెన్నెల కిశోర్ అవన్నీ ట్రాఫిక్ కోట్స్ అని, ప్రశాంతంగా ఉండి, కిందకి స్క్రోల్ చేయడమే అంటూ రిప్లై ఇచ్చాడు.

సింగర్ చిన్మయి కూడా స్పందించడం విశేషం. మహానుభావుల మాటలు అర్థం కావు అంటూ ఆమె ట్వీట్ చేశారు. అసలు శేష్ అలా ఎందుకు ట్వీట్ చేశాడు..? దానికి వీళ్లు ఇలా ఎందుకు రిప్లై ఇచ్చారు అని నెటిజన్లు బుర్రగోక్కుంటున్నారు.