Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' డిఫరెంట్ సీతను చూపించనుందా..??

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
ఆదిపురుష్ డిఫరెంట్ సీతను చూపించనుందా..??
X
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరోయిన్ స్టార్ అవుతుందో.. స్టార్డం అందుకున్న హీరోయిన్ ఎప్పుడు ప్లాప్ లలో ఇరుక్కుపోతుందో చెప్పలేం. కానీ ఖచ్చితంగా వారి ప్రెసెంట్ పోసిషన్లకు కారణం మాత్రం సినిమానే. ఎందుకంటే సినిమా అనేది మ్యాజిక్ లాంటిది. సక్సెస్ అయితే అందలం చూపిస్తుంది. ప్లాప్ అయితే మాత్రం కెరీర్ సంధిగ్ధంలో పడిపోతుంది. కానీ ఇలా అందరి హీరోయిన్స్ విషయంలో జరగదు. అదృష్టం కొద్దీ కొందరు అనుకోకుండానే ఊహించని రేంజిలో సెటిల్ అయిపోతారు. అదేవిధంగా అదృష్టం కొద్దీ పాన్ ఇండియా సినిమాలు కూడా దక్కించుకుంటారు.

ప్రస్తుతం అదే ఫీట్ ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్. కృతి ఇంకా స్టార్ కాలేదు కానీ ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నటువంటి మూవీస్ లైనప్ చూస్తే ఖచ్చితంగా త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరుతుందని అర్ధమవుతుంది. ఇప్పుడు కృతి చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయట. కానీ అన్నింట్లోకి ప్రత్యేకంగా అనిపిస్తుంది మాత్రం ఆదిపురుష్ మూవీనే అంటోంది అమ్మడు. ఎందుకంటే కెరీర్ లో ఫస్ట్ టైం కృతి ఓ మైథలాజికల్ రోల్ ప్లే చేస్తోంది. అదికూడా అందరికి ఆదర్శప్రాయమైన సీతాదేవి రోల్ కావడంతో స్పెషల్ అట్రాక్షన్ కూడగట్టుకుంటుంది.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడుగా కనిపించనుండగా.. కృతి సీతాదేవిగా కనిపించనుంది. అలాగే రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రం గురించి కృతి చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. ఎందుకంటే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీతాదేవి క్యారెక్టర్ ఇదివరకు అందరు చూపించినట్లుగా ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండే సీతగా కాకుండా మేకర్స్ చాలా డేరింగ్ గా చూపనున్నట్లు తెలుస్తుంది. సీతాదేవి ఎమోషనల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి వయోలెన్స్ మాత్రం ఎవరు చూపలేదు. ఈసారి ఆదిపురుష్ లో డిఫరెంట్ వారియర్ సీతను చూస్తారని బాలీవుడ్ వర్గాలలో టాక్. చూడాలి మరి నిజంగానే కృతి సీతగా మెస్మరైజ్ చేయనుందేమో!