Begin typing your search above and press return to search.

ఆదిపురుష్.. పఠాన్ ను కొట్టాలంటే..

By:  Tupaki Desk   |   10 Jun 2023 10:02 AM GMT
ఆదిపురుష్.. పఠాన్ ను కొట్టాలంటే..
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మూవీతో జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు మేకర్స్ లో టెన్షన్ కూడా ఉంది. ఎంతగా చెప్పిన ఆదిపురుష్ సినిమాని ఆడియన్స్ గతంలో వచ్చిన రామాయణం కథతో పోల్చి చూడటమే. అయితే బిజినెస్ పరంగా 550 కోట్ల వరకు జరిగిందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే బిజినెస్ జరిగిన మొత్తం బ్రేక్ ఈవెన్ గా అందుకొని అదనంగా ఒక 50 కోట్లు వచ్చిన పఠాన్ షేర్ కలెక్షన్స్ రికార్డ్ ని ఆదిపురుష్ ఈజీగా అందుకుంటుంది. ఈ ఏడాదిలో చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ 1050 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఈ ఏడాదిలో ఇదే హైయెస్ట్ రికార్డ్. దీని తర్వాత మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 330 కోట్ల గ్రాస్ అందుకుంది.

అయితే బడ్జెట్ పరంగా ఇంకా ఎక్కువ కావడంతో మూవీ అబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది. ఇక ఇళయదళపతి విజయ్ వారిసు మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అందుకొని కొంత లాభం మాత్రమే ఈ చిత్రం దిల్ రాజుకి తీసుకొచ్చింది. ఇక సెన్సేషన్ మూవీ ది కేరళ స్టోరీ ఏకంగా 290 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి వెళ్తుంది.

కేవలం 15 కోట్లతో ఈ మూవీతీయగా వివాదం కావడం, హిందుత్వ భావజాలం ఉన్న అందరికి విపరీతంగా కనెక్ట్ కావడంతో ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తరువాత మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య మూవీ 235 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీటన్నింటిలో ఆదిపురుష్ మెయిన్ టార్గెట్ మాత్రం పఠాన్ అని చెప్పాలి. పఠాన్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం ఆదిపురుష్ కి ఉంది.

మొదటి రోజు మూవీ వంద కోట్ల గ్రాస్ ని ఈజీగా అందుకునే ఛాన్స్ ఉంది. అయితే రెండో రోజు నుంచి మాత్రం ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అయ్యిందనే దానిని బట్టి ఉంటుంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో కథ, పాత్రల చిత్రణకి ఆడియన్స్ ముందుగా కనెక్ట్ అవ్వాలి. అందే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా సంతృప్తి చెందాలి అప్పుడే ఆదిపురుష్ మూవీ రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంటుంది.