ఫ్యాన్స్ టాక్... ఎన్టీఆర్ ఆదిపురుష్ ఎందుకు కాలేదు

Fri Mar 31 2023 11:20:19 GMT+0530 (India Standard Time)

Fan Talk... Why NTR did not become Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ నుండి మరో పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్ తో చిత్రం రామాయణ ఇతివృత్తం ఆధారంగా రూపొందినది అంటూ మరింత క్లారిటీ వచ్చేసింది.శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించబోతుండగా.. సీతాదేవి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రామాయణం ఇతివృత్తంతో ఎన్నో సినిమాలు వచ్చాయి.. అయితే వాటన్నింటితో పోలిస్తే ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది... విభిన్నమైన చిత్రం అంటూ దర్శకుడు మొదలుకొని యూనిట్ సభ్యులందరూ కూడా బలంగా వాదిస్తున్నారు.

సినిమా గురించి కొందరు నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నా కూడా విడుదల సమయంలో అదంతా కనుమరుగవడం ఖాయమని.. తప్పకుండా ప్రతి ఒక్కరిని అలరించే విధంగా సినిమా ఉంటుందని వారు ధీమాతో ఉన్నారు. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూసిన ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శ్రీరాముడి పాత్రను ఈ జనరేషన్ హీరోల్లో పోషించగల వ్యక్తి కేవలం ఎన్టీఆర్ మాత్రమే అని... ప్రభాస్ కాకుండా ఆదిపురుష్ సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పుడే రాముడిగా నటించి అలరించి అవార్డును సైతం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు రాముడి పాత్ర ను చేస్తే ఏ స్థాయిలో పోషించగలడా ఊహించుకోవచ్చు.

కనుక ఆదిపురుష్ ఎన్టీఆర్ చేసి ఉంటే బాగుండేది అంటూ నందమూరి ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ విషయమే ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఆదిపురుష్ ప్రబాస్ కి సరిగ్గా సెట్ అయ్యే పాత్ర... ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే ప్రభాస్ ఆదిపురుష్ గా మెస్మరైజ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది.

ఈ సినిమా తో పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ గుర్తింపు దక్కించుకుంటారని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఈ విషయమై ఆసక్తికర చర్చ జరిగింది.. జరుగుతూనే ఉంది.