Begin typing your search above and press return to search.

తెలుగులో ఆదిపురుష్ రికార్డు బిజినెస్

By:  Tupaki Desk   |   28 May 2023 4:35 PM GMT
తెలుగులో ఆదిపురుష్ రికార్డు బిజినెస్
X
కెరీర్ ఆరంభం నుంచి తెలుగు సినిమాలకే పరిమితం అయినా.. ఈ మధ్య కాలంలో మాత్రం పాన్ ఇండియా స్టార్‌గా ఇండియా వ్యాప్తంగా తన రేంజ్‌ను చూపించుకుంటూ దూసుకెళ్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అంతేకాదు, ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే సినిమాలో నటించాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

రామాయణం నేపథ్యంతో రూపొందిన 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఇలా టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలను కూడా ఒక్కొక్కటిగా వదులుతున్నారు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న హైప్ అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది.

'ఆదిపురుష్' మూవీపై ఉన్న హైప్ కారణంగా ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్‌లో పోటీ ఏర్పడింది. ముఖ్ంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను కూడా ఒక్కో ఏరియా, భాషను బట్టి డీల్స్ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల బిజినెస్ భారీ ధరకు అమ్మినట్లు ఓ న్యూస్ లీకైంది.

ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుందట.

ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 170 కోట్లు మొత్తాన్ని నిర్మాతలకు ఇచ్చినట్లు తెలిసింది ఇది ప్రభాస్ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో రెండో అత్యధిక బిజినెస్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న చిత్రాల్లో RRR మూవీ రూ. 191 కోట్లుతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు 'ఆదిపురుష్' దీని తర్వాతి స్థానానికి చేరుకుంది. ఇక, ఈ మూవీకి బిజినెస్‌కు తగ్గట్లుగానే ఆంధ్రా, తెలంగాణలో అత్యధిక థియేటర్లు కూడా దొరికే అవకాశం ఉంది. దీనికితోడు మంచి టాక్ వస్తే ఈ చిత్రం తక్కువ సమయంలోనే టార్గెట్‌ను చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.