Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ ప్రీరిలీజ్: బారికేడ్లు తోసుకొచ్చిన భారీ కాషాయ దండు
By: Tupaki Desk | 6 Jun 2023 8:55 PMజై శ్రీరామ్ ... జై శ్రీరామ్ .. రాజారామ్.. జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ .. రాజారామ్.. జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ .. రాజారామ్.. జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ .. రాజారామ్.. ఎటు చూసినా ఇదే నినాదం. నేటి సాయంత్రం తిరుపతి లోని ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం వేలాది గా అభిమానులు దూరా తీరాల నుంచి ప్రయాణించి మరీ వచ్చారు. అయితే ఇతర ఈవెంట్ల తో పోలిస్తే ఆదిపురుష్ ఈవెంట్ ని యూనిక్ గా ఆవిష్కరించేందుకు చిత్రబృందం చాలా శ్రమించిందని అర్థమవుతోంది. రామాయణేతిహాసం సిసలైన అనుభూతి ని అందించడానికి మేకర్స్ అయోధ్య లోని రామమందిరాన్ని ప్రీఈవెంట్ కోసం పునర్నిర్మించారు. ఈ భారీ ఈవెంట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రభాస్ అభిమానులు హాజరయ్యారు. వేదిక చుట్టూ LED స్క్రీన్ లపై ప్రదర్శిస్తున్న అయోధ్యలోని రామమందిర ప్రతిరూపాన్ని వీక్షించి ప్రజలు తరించారు.
ప్రభాస్- కృతి సనన్- ఓం రౌత్- దేవ్ దత్ - సన్నీసింగ్ తదితరులు ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు. 2023లో ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ట్రైలర్ లాంచ్ ను చూసేందు కు వేలాది మంది ప్రభాస్ అభిమానులు తోసుకుంటూ ఒకే చోట గుమిగూడారు. నిజానికి ఊక వేస్తే రాలనంత మంది ఈ వేడుక కు తరలివచ్చారు. అయితే మూడు నాలుగు సెక్షన్లుగా బారికేడ్లు వేసి విభజించడం తో అభిమానులు అత్యుత్సాహంతో వాటి ని తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కొందరు ఆడవాళ్లు సైతం బారికేడ్లు ఎక్కి గెంతేయడం వేదిక వద్ద కలవరపరిచింది. అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు చాలా సేపు హోస్ట్ లు ప్రకటనలు చేస్తూ శ్రమించాల్సి వచ్చింది. ఇక వేదిక వద్దకు భారీ గా కాషాయ చొక్కాలు ధరించిన ప్రభాస్ అభిమానులు కాషాయ జెండాల తో తరలిరావడమే గాక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ బోలెడంత సందడి సృష్టించారు.
అభిమానులు సోషల్ మీడియా సైట్ లలో తమ ఉత్సాహాన్ని పంచుకోవడం ద్వారా ఇప్పటికే ఇంటర్నెట్ లో సాలిడ్ బజ్ సృష్టించారు. ఈవెంట్ నుండి కొన్ని అద్భుత మైన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో అయోధ్య లోని రామమందిరాన్ని పునఃసృష్టించడాన్ని చూడవచ్చు. ఆసక్తికరం గా హనుమంతుడు సినిమా హాలు లో ఆదిపురుషుడి ని చూడాలా? అయితే భజరంగబలి (ఆంజనేయుని) కోసం ప్రతి థియేటర్ లో 1 సీటు రిజర్వ్ చేసారట. తిరుపతి లో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముందుగానే దీనిని మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ వేడుక కు చేరుకునేందుకు ప్రభాస్ అభిమాను లు రోడ్ల పై భారీ ర్యాలీ ని ప్రారంభించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తిరుమల ఆలయంలో ఆశీస్సులు కోరిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్వాహకులు అయోధ్యలోని రామమందిరం ప్రతిరూపాన్ని ప్రదర్శించడాని కి భారీ LED స్క్రీన్ లను ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ రామమందిరాని కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా యూనివర్సిటీ క్యాంపస్ లో భారీ వేదికను కూడా నిర్మించారు. ఈ కార్యక్రమం లో మేకర్స్ ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. దీన్ని చూసేందు కు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆదిపురుషుని గురించి...
ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా టీసిరీస్ భూషణ్ కుమార్ నిర్మించారు. ఇందు లో ఆదిపురుష్ గా ప్రభాస్- జానకి గా కృతి సనన్- లంకేశ్ గా సైఫ్ అలీఖాన్- లక్ష్మణుడి గా సన్నీ సింగ్- హనుమంతుడి గా దేవదత్తా నాగే నటించారు. ఆదిపురుష్ కి అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ట్రైలర్ కి మాస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కాస్త ముందుగానే హనుమంతుని కోసం ప్రతి సినిమా హాలులో 1 సీటును రిజర్వ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నిర్ణయం పై అభిమానులు చాలా సంతోషం గా ఉన్నారు. ఆదిపురుష్ 16 జూన్ 2023న హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ భాషల్లో విడుదల కానుంది.