Begin typing your search above and press return to search.

ఆది పురుష్ ఓపెనింగ్స్ లెక్కలు ఇవేనా?

By:  Tupaki Desk   |   9 Jun 2023 5:00 PM GMT
ఆది పురుష్ ఓపెనింగ్స్ లెక్కలు ఇవేనా?
X
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయన మార్కెట్ విలువ సైతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో ఆకట్టుకోలేక పోయినా మంచి కలెక్షన్స్ అయితే కాబట్టి దానికి కారణం ప్రభాస్ కు ఉన్న మార్కెట్ అని చెప్పవచ్చు.

దీంతో సాహో సినిమా విడుదలైన మొదటి రోజు 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటే అది కేవలం ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ కారణం తోనే. బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై హైట్ క్రియేట్ అయ్యాయి దీంతో మొదటి రోజే వందకోట్ల మైలు రాయిని అందుకుంది సాహో సినిమా.

ఆ తర్వాత విడుదలైన రాధే శ్యామ్ ఇదే మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయింది. దానికి ఆశించినంత హైప్ రాలేదు. పైగా నెగెటివిటీనే కనిపించింది. దీంతో సాహో వసూళ్లలో తొలి రోజు సగం కూడా రాబట్టలేకపోయింది రాధేశ్యామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇప్పుడు ప్రభాస్ ఆది పురుష సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి లెక్కలు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి మొదట రిలీజ్ చేసిన టీజర్ తో నెగెటివిటీ స్టార్ట్ అయ్యింది.

ఆ టీజర్ చూశాక ఇది చిన్నపిల్లల సినిమాగా చాలా మంది భావించారు. దర్శకుడు ఓంరావత్ గ్రాఫిక్ వర్క్ ను మళ్లీ ఎడిట్ చేశాక ఈ సినిమాపై కాస్త పాజిటివిటీ ఏర్పడింది. ఇప్పటికి విడుదలైన టీజర్స్ ట్రైలర్స్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఏ కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులంతా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఇక వేసవిలో ఏ భారీ సినిమా లేకపోవడం... హిట్ వేవ్స్ కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా మొదటి రోజు 100 కోట్లను అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. రాముడిగా ప్రభాస్ , సీతగా కృతి సనన్, రావణుడి గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూన్ 16న తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.