ఆదిపురుష్ పోస్టర్.. ఓంరౌత్ ని బాపు పూనాడా?

Thu Mar 30 2023 09:12:43 GMT+0530 (India Standard Time)

Adipurush New Poster For Ramanavami

నేటి శ్రీరామనవమిని పురష్కరించుకుని 'ఆదిపురుష్' టీమ్ అద్భుతమైన ట్రీట్ ఇస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూసారు. గడిచిన ఆరేడు నెలలుగా ఓంరౌత్ బృందం స్థబ్ధుగా ఉండడంతో  ఫ్యాన్స్ గుర్రుమీదున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ అప్ డేట్ చెప్పడానికి ఓంరౌత్ ఎందుకు సందేహిస్తున్నాడంటూ నెటిజనులు సోషల్ మీడియాల్లో కోపం ప్రదర్శించారు. అయితే అభిమానులు నెటిజనులను శాంతింపజేసేందుకు ఆదిపురుష్ టీమ్ ఎట్టకేలకు శ్రీరామనవమి కానుకగా ప్రత్యేక పోస్టర్ తో ముందుకు వచ్చింది. డార్లింగ్ అభిమానులను ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పోస్టర్ విడుదల కావడంతో ఇది అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.రామ నవమి శుభ సందర్భంగా.. మేకర్స్ ఆదిపురుష్ కొత్త పోస్టర్ తో ఒక విధంగా సర్ ప్రైజ్ చేసారని చెప్పాలి. ఈ పోస్టర్ ని ఓంరౌత్ అండ్ టీమ్ ఎంతో శ్రద్ధ వహించి పొందిగ్గా రూపొందించారు. దీనికోసం చాలా రీసెర్చ్ చేశారని కూడా అర్థమవుతోంది. నిజానికి ఈ ప్రత్యేక పోస్టర్ చూడగానే బాపు తెరకెక్కించిన 'శ్రీరామరాజ్యం' పోస్టర్ లా క్లారిటీ మిస్ కాకుండా ఉందని కితాబిచ్చేస్తున్నారు అంతా. ఇలా రియాలిటీకి నేచురాలిటీకి దగ్గరగా ఒక పోస్టర్ ని రూపొందించడం రిలీజ్ చేయడం ఉత్కంఠను కలిగించింది. అలాగే ఈ పోస్టర్ లోనే ఆదిపురుష్ రిలీజ్ తేదీ 16 జూన్ 2023 అంటూ మరోసారి క్లారిటీనిచ్చింది చిత్రబృందం.

కొత్త పోస్టర్ లో ప్రభాస్- కృతి సనన్- సన్నీ సింగ్ .. ఆంజనేయుడు పాత్రధారి దేవాదత్తా ఉన్నారు. రామనవమి శ్లోకాల ప్రతిధ్వని నడుమ 'ఆదిపురుష్' నిర్మాతలు అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేశారంటూ ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పోస్టర్ లో రాఘవ్ గా ప్రభాస్- జానకిగా కృతి సనన్- శేష్గా సన్నీ సింగ్- భజరంగ్ గా దేవదత్తా పోస్టర్ లో కనిపించారు.

అయితే ఈ పోస్టర్ లో రావణ్ పాత్రను పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ ని ఎలివేట్ చేయకపోవడం విశేషం. ఈ చిత్రం ద్వారా ప్రభు శ్రీరాముని ధర్మాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇది ధర్మం- ధైర్యం- త్యాగం వంటి అద్భుత విషయాలను ప్రతిబింబించే సినిమా. 'ఆదిపురుష్' కొత్త పోస్టర్ ను షేర్ చేస్తూ- మంత్రోన్ సే బధ్కే తేరా నామ్ జై శ్రీరామ్! అని ప్రభాస్ రాశాడు. సీత పాత్రధారి కృతి సనోన్ సహా ఇతర చిత్రబృందం ఈ పోస్టర్ ని షేర్ చేసారు.

రామనవమి భగవంతుడు శ్రీరాముని జన్మదినోత్సవం .. మంచికి ఆరంభం శుభసూచిక అంటూ ప్రజలు రామనవమిని అందమైన పండుగగా జరుపుకుంటారు. అధర్మాన్ని ఓడించడానికి ధర్మ స్థాపన చేసేందుకు భగవాన్ శ్రీరాముడు చేసే ప్రయత్నానికి చిహ్నంగా ఇప్పుడు ఆదిపురుష్ పోస్టర్ ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరంలో అత్యంత భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ అయోధ్య రాజు రాఘవ పాత్రను పోషించగా.. ఈ కథ 7000 సంవత్సరాల క్రితం సాగుతుంది. సీతను అపహరించిన లంకేష్ ని సంహరించేందుకు సీతను రక్షించడానికి రాఘవ లంకకు బయల్దేరిన క్రమంలో ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే. సైఫ్ అలీఖాన్ ఇందులో ప్రతినాయకుడు లంకేష్ పాత్రను పోషించారు. ఆదిపురుష్ తో అతడు తెలుగు సినీ రంగంలో అరంగేట్రం చేస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ ను టి-సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్- ఓం రౌత్- ప్రసాద్ సుతార్ -రెట్రోఫైల్స్ కు చెందిన రాజేష్ నాయర్ నిర్మించారు. 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.