ఆదిపురుష్.. లెక్క మారితే మరింత ఆలస్యం?

Thu Dec 01 2022 18:00:02 GMT+0530 (India Standard Time)

Adipurush.. More delay if the calculation changes?

రామాయణం కథ ఆధారంగా సరికొత్త 3D టెక్నాలజీతో ఆదిపురుష్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ సీతమ్మ తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. ఇక మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భయంకరమైన రావణాసురుడి పాత్రలో కూడా నటించేందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే.అయితే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ కు చేదు అనుభవం ఎదురయింది. ఒకే ఒక్క టీజర్ విడుదల చేయగా ఊహించని విధంగా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేసింది.

గ్రాఫిక్స్ విషయంలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరగడంతో దెబ్బకు చిత్రం యూనిట్ సభ్యులందరూ కూడా మళ్ళి ఆలోచనలో పడ్డారు. ఇక సినిమాను ఇప్పట్లో విడుదల చేస్తే మంచిది కాదు అని ప్రభాస్ మళ్ళీ దర్శక నిర్మాతలతో మాట్లాడి రీ వర్క్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు.

దీంతో సినిమాను వచ్చే ఏడాది జూన్లో విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక  టాక్ ప్రకారం ఆదిపురుష్ సినిమా ఆ సమయానికి కూడా వస్తుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్లాన్ ప్రకారం గ్రాఫిక్స్ పనులు మరికొంత ఆలస్యం జరిగిన జరగవచ్చని అంతేకాకుండా వెంట వెంటనే ప్రభాస్ సినిమాలు 2023లో విడుదల అయితే కూడా బాగుండదు అనే ఆలోచనతో ఉన్నారు.

ఏదేమైనా ప్రస్తుతం టాక్ ప్రకారం అయితే సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో వచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది. 2024 లోనే సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాకు తప్పనిసరిగా ఫెస్టివల్ సీజన్ ఉంటేనే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది అని సినిమాపై నెగెటివిటీ ఎంత ఉన్నా కూడా ఆ టైంలో నష్టాలు వచ్చినా మరి భారీ స్థాయిలో అయితే రావనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.