Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంట..

By:  Tupaki Desk   |   8 Jun 2023 4:00 PM
ఆదిపురుష్ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంట..
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా అలరించబోతున్న సినిమా అధిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. సుమారు 550 కోట్ల బిజినెస్ డీల్స్ ఆదిపురుష్ చిత్రంపై జరిగాయంట.

ఇక తాజాగా వచ్చిన ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో మూవీపై ఇప్పుడు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో పాటు ఒరిజినల్ వాల్మీకీ రామాయణం ఆధారంగా ఈ చిత్రం కథనం దర్శకుడు ఓం రౌత్ చూపించారు. అందుకే పాత్రల చిత్రణ ఇప్పటి వరకు చూసిన రామాయణం కథలకి భిన్నంగా ఉన్నాయి.

అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ కి రామాయణం కథని మరింత దగ్గర చేసే ప్రయత్నం ఆదిపురుష్ తో ఓం రౌత్ చేయబోతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ సర్టిఫికేట్ ని సెన్సార్ ఈ చిత్రానికి ఇచ్చింది. మూవీలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా కూడా అందులో రక్తపాతం లేకుండా చూపించడం కూడా యూ సర్టిఫికేట్ రావడానికి కారణం అని తెలుస్తోంది.

ఇక సినిమా నిడివి 2:59 నిమిషాలు ఉందంట. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ సమయమే థియేటర్స్ లో ఆదిపురుష్ కోసం ఓం రౌత్ కూర్చోబెడుతున్నారు. మరి ఈ మూవీకి ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాలంటే మరో ఎనిమిది రోజులు ఎదురుచూడాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి 10 వేల టికెట్లు వృద్ధాశ్రమం, అనాధాశ్రమంలో ఉన్నవారికి ఉచితంగా ఇవ్వబోతున్నారు. దీనికోసం వారు గూగుల్ ఫామ్స్ లో దరఖాస్తు చేసుకుంటే ఆశ్రమానికి వెళ్లి ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటు హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ప్రతి థియేటర్ లో ఒక సీట్ రిజర్వ్ చేస్తున్నారు.