జబర్ధస్ట్ కి దిష్టి తగిలిందా… అదిరే అభి పోస్ట్ వైరల్

Mon Jan 30 2023 13:33:14 GMT+0530 (India Standard Time)

Adhire Abhi Emotional Comments On Jabardasth

బుల్లితెరపై ఈటీవీలో మల్లెమాల స్టార్ట్ చేసిన జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. వారిలో కొంత మంది స్టార్స్ ఆర్టిస్ట్స్ కూడా అయ్యారు. శంకర్ హైపర్ ఆది సుదీర్ ఆటో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను లాంటి వారందరూ కూడా సినిమాలలో మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇక జబర్ధస్ట్ ద్వారా గుర్తింపు పొందిన అనసూయ ఇప్పుడు అన్ని భాషలలో సినిమాలు చేస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపొయింది. రష్మి కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది.ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి జబర్దస్త్ ఇమేజ్ మసకబరుతూ వస్తుంది. నాగబాబు జబర్దస్త్ షోని వదిలేసిన తర్వాత పోటీలో స్టార్ మాలో కామెడీ షోలు స్టార్ట్ చేశారు. అవి సీజనల్ వారీగా నడుస్తున్నాయి.

ఆ సమయంలో చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్ట్స్ లు నాగబాబుతో పాటు బయటకి వెళ్ళిపోయారు. ఇక రోజాకి మంత్రి పదవి వచ్చాక ఆమె కూడా జబర్దస్త్ ని వదిలేసింది. ప్రస్తుతం కుష్బూ ఇంద్రజతో షోని నడిపిస్తున్నారు. ఇక అప్పట్లో ఉన్నవారిలో చాలా మంది జబర్దస్త్ ని వీడారు. హైపర్ ఆది కూడా జబర్దస్త్ నుంచి పూర్తిగా బయటకి వచ్చినట్లే తెలుస్తుంది.

అయితే పటాస్ తో గుర్తింపు పొందిన వారు మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చారు. ఇప్పుడు అనుకున్న స్థాయిలో షోకి రేటింగ్స్ రావడం లేదనేది అందరి నుంచి వినిపించే మాట. ఇదిలా ఉంటే జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాక చాలా మంది షో మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు.

అనసూయ కూడా కామెంట్స్ చేసింది. అలాగే ఆర్పీ కూడా విమర్శలు చేశారు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాడు. తాజాగా అతను ట్విట్టర్ లో ఒక లేఖ పెట్టారు.

జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జబర్దస్త్ కుటుంబంలో అందరికి కలిసి మెలిసి ఉండే అందరం ఇప్పుడు ఎవరికి వారుగా విడిపోయాం. ఎవరైనా అంటే క్షమించని మేము ఇప్పుడు మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం.

అంటూ జబర్దస్త్ లో తాము గడిపిన రోజులని గుర్తుచేసుకుంటూ ఎవరో దిష్టి పెట్టారంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అదిరే అభి పోస్ట్ పెట్టినట్లే ఇప్పుడు జబర్దస్త్ లో ఎక్కడా యూనిటీ కనిపించడం లేదు. ఎవరికివారే అన్నట్లుగా అందరూ ఉన్నారనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.