శృంగారం అశ్లీలానికి తేడా తెలుసుకోండంటున్న నటి

Wed Jul 21 2021 17:00:01 GMT+0530 (IST)

Actress supports Raj Kundra

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యవహారం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఒక్కరొక్కరూ బయటకు వచ్చి తలో రకంగా దీనిపై మాట్లాడుతున్నారు. తాజాగా రాజ్ కుంద్ర వ్యవహారంపై వివాదాస్పద నటి మోడల్ గెహానా వశిష్ట్ (వందన తివారీ) స్పందించింది. తాము ఎలాంటి పోర్న్ వీడియోలు తయారు చేయలేదని వివరణ ఇచ్చింది.రాజ్ కుంద్రాతో కలిసి తీసినవి నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమేనని నటి గెహానా చెప్పుకొచ్చింది. కానీ కొందరు కావాలనే తమను టార్గెట్ చేశారని ‘గంధీ బాత్’ ఫేమ్ గెహానా సంచలన వ్యాఖ్యలు చేసింది.

శృంగారానికి అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది గెహానా. తానసలు పోర్న్ సినిమాల్లో నటించనే లేదని చెప్పుకొచ్చింది. తమ వీడియోల్లో ఒక్కటి కూడా అశ్లీల వీడియో కిందకు రాదని ఆమె స్పష్టం చేసింది.

ఏక్తాకపూర్ లాంటి వారు చేసే వీడియోల్లాంటివే తప్ప ఇందులో అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ రాజ్ కుంద్రాను గెహానా వెనకేసుకొచ్చింది. ముందు తమ వీడియోలు చూసి అప్పుడు అవి అశ్లీల వీడియోలో కావో తేల్చాలని డిమాండ్ చేసింది.

ఎరోటికా కంటెంట్ తో అశ్లీల వీడియోలను కలపడం సరైంది కాదని నటి గెహానా తెలిపింది. ఇంటర్నెట్ లో సర్క్యూలేట్ అవుతున్న అసలైన పోర్న్ వీడియోలపై దృష్టి పెట్టాలని ఆమె కోరింది.ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. నిజమైన నేరస్థులు ఎవరో.. కోర్టులు తేలుస్తాయని.. న్యాయం జరుగుతుందని గెహానా తెలిపారు. కావాలనే కొందరు తనను శిల్పాశెట్టిని కుంద్రాను టార్గెట్ చేస్తున్నారని గెహానా ఆరోపించింది.

రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్ దేశంలో కెన్నిన్ సంస్థలో పనిచేశారని.. ఈ అశ్లీల ఫిల్మ్ ల కోసం చాలా మంది ఏజెంట్లకు  కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా కూడా ఉన్నట్టు ముంబై సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె స్పందించి ఇవి అశ్లీల వీడియోలు కావని వివరణ ఇచ్చింది.